Home Unknown facts శనీశ్వరుడికి ఎదురుగా నిల్చొని పూజించకూడదని మీకు తెలుసా?

శనీశ్వరుడికి ఎదురుగా నిల్చొని పూజించకూడదని మీకు తెలుసా?

0
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం’అంటారు. నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించిన వాడు, తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం.
  • సాధారణంగా శనీశ్వరుడు పేరు చెప్పగానే ఉలిక్కి పడతాం. ఆయన పేరు వింటే తెగ ఆందోళన పడిపోతారు. మన జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటాం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు.
  • శనీశ్వరుడిని పూజించడం వల్ల మనకు శని ప్రభావం కలుగుతుందని భావించి శని దేవుడిని పూజించడానికి భయపడుతుంటారు ఈ క్రమంలోనే నవగ్రహాలను కూడా పూజించడానికి వెనకడుగు వేస్తారు.
  • కానీ శనీశ్వరుడు కేవలం తన ప్రభావాన్ని ఎవరైతే కర్మ చేసే ఉంటారో వారి కర్మకు తగ్గ ఫలితాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా శని ప్రభావ దోషం ఉన్న వారు లేదా శనీశ్వరుడిని పూజించాలి అనుకున్న వారు కొన్ని రకాల పద్ధతులను పాటిస్తూ పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి శని ప్రభావం ఉండదని చెప్పవచ్చు.
  • ముఖ్యంగా శనీశ్వరుడిని శనివారం పుష్పాలతో నువ్వుల నూనెతో పూజ చేయటం వల్ల మన పై ఉన్నటువంటి దోషాలను తొలగిస్తాడు. అయితే శనీశ్వరుడికి పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి.
  • సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు స్వామి వారికి ఎదురుగా నిలబడి పూజలు చేస్తుంటారు. కానీ శనీశ్వరుడి విషయంలో మాత్రం ఇలా చేయకూడదు. ఎప్పుడూ కూడా స్వామివారికి ఎదురుగా నిలబడి పూజించకూడదు.
  • స్వామివారికి పూజ చేసే సమయంలోను లేదా నమస్కరించే సమయంలో ఎదురుగా కాకుండా పక్కన నిలబడి నమస్కరించాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.

Exit mobile version