ఈ శాపం కారణంగానే సీతాదేవిని రావణాసురుడు తాకలేదా???

భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో రామాయణం ఒకటి. విష్ణు మూర్తి రాముడిగా అవతరించినట్లు పురాణాల్లో పేర్కొన్న విషయం చాలా మందికి తెలిసిందే. మానవులకు మరియు దేవతలకు అనేక ఇబ్బందులు కలిగించిన రావణుడిని రాముడు హతమార్చాడు.
రామాయణం అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది సీతమ్మ స్వయంవరం, వనవాసం, వనవాసంలో సీతాదేవి అపహరణ, రావణాసురుడుతో యుద్ధం ఇవన్నీ మనకు గుర్తొస్తాయి.

swayamvarఇలా ఎన్నో పద్యాలు, శ్లోకాలు వంటి విషయాలు రామాయణంలో దాగి ఉన్నాయి. వాటన్నింటి గురించి తెలుసుకోవాలంటే మనకు ఎంతో సమయం పడుతుంది. కానీ రామాయణంలో అత్యంత కీలకమైన భాగం సీతాదేవి అపహరణ. అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధించిన సంగతి మనకు తెలిసినదే.

ravana and sitaకానీ అన్ని రోజులు సీతాదేవిని రావణాసురుడు బంధించినా ఎప్పుడు కూడా సీతమ్మను తాకలేదు అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… ఇంద్రుడి సభలో ఉండే రంభ తన నాట్యంతో అందరిని ఆకట్టుకుంటుంది.

అయితే తన అందచందాలను చూసిన రావణాసురుడు ఎలాగైనా ఆమెను తన సొంతం చేసుకోవాలని భావిస్తాడు. తనతో గడపాలని రావణాసురుడు రంభను ఒత్తిడి చేస్తాడు. అందుకు రంభ ఒప్పుకోకపోవడంతో ఆమె వెంటపడి ఆమెను బలవంత పెడుతుంటాడు.
ఈ క్రమంలోనే రంభ ప్రియుడు నల కుబేరుడు రావణాసురుడికి ఒక శాపం పెడతాడు.

templeఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా బలవంతంగా తాకడానికి ప్రయత్నిస్తే అతని తల పగిలిపోతుందనే శాపాన్ని పెడతాడు. ఈ శాపం కారణంగా చేసేదేమీలేక రావణాసురుడు రంభ విషయంలో వెనక్కి తగ్గుతాడు. తరువాత కొంతకాలానికి అరణ్యవాసం చేస్తున్న సీతాదేవి ఎదుట మారు వేషంలో వచ్చి తనను అపహరించి వెళ్తాడు.

ravana and sitaసీతా దేవిని ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధించిన రావణాసురుడు ఏ రోజు కూడా సీతాదేవిని తాకలేదు.
నల కుబేరుడు శాపం కారణంగా రావణాసురుడు ఆమెను తాకకుండా కేవలం అశోకవనంలో బంధించాడు. తరువాత హనుమంతుడి సహాయంతో సీతాదేవి జాడను కనుగొన్న శ్రీ రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి యుద్ధంలో రావణాసురుని సంహరించి సీతను తీసుకుని సతీసమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు. ఈ శాపం కారణంగానే సీతాదేవిని తాకడానికి రావణాసురుడు భయపడతాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR