నాడి జ్యోతిష్యం అంటే ఏంటి? దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి ?

మన హిందూ సంప్రదాయంలో జ్యోతిష్యం అంటే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఇక నాడి జ్యోతిష్యం గురించి వాస్తవాలు ఇప్పటికి అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇదే విషయం పైన కొందరు పండితులు ఏం అంటున్నారు అంటే, నాడీజ్యోతిశ్యం అనేది నూటికి నూరు శాతం నిజమని నాడి శాస్రంలోని రహస్యాలు అసత్యం కాదని వారు చెబుతున్నారు. మరి నాడి జ్యోతిష్యం అంటే ఏంటి? దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

nadi jyothishyamనాడీ గ్రంథాలు రెండు రకాలు. ఒకటి మంత్రనాడి. రెండు తంత్రనాడి. ఇక మంత్రం నాడి విషయానికి వస్తే, నాడీ గ్రంథాలలో సంస్కృత గ్రంథాలు ఒక కోవకు చెందినవి. వీటిని భ్రుగుసంహితలు అంటారు. తమిళ భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఇంకొక కోవకు చెందినవి. అంతేకాకుండా ఇందులో అర్ధం కానీ ప్రాకృత భాషలోఉన్నగ్రంథాలు మరికొన్నిఉంటాయి. ఇది తమిళ, మళయాళ, తెలుగులిపుల కలగలుపుగా, శాసనాల మీద కనిపించే ప్రాచీన లిపికి దగ్గరగా ఉంటుంది. బహుశా ఇది అంతరించిపోయిన గుణాడ్యుని పైశాచిక భాషకావచ్చు అని చెబుతారు.

మంత్రగ్రంథాలలోతమిళ, పైశాచిక (?) గ్రంథాలు హెచ్చు. వీటిలో తిరిగి రెండు రకాలున్నాయి. మొదటిరకంలోని తాళపత్ర గ్రంథాలలోఅర్థంకాని భాష ఉంటుంది. ఇది ప్రాచీన తమిళం సెందమిళం అని కొందరు చెబుతారు. మామూలు తమిళం వచ్చినవారు కూడా దీనిని చదువలేరు, అర్ధం చేసుకోలేరు. రెండవ రకానికి చెందినవే అసలుమంత్రనాడీగ్రంథాలు. వీటిలో తాళపత్రాలు ఖాళీగా ఉంటాయి. కాని చదివేటప్పుడు విచిత్రభాషలో అక్షరాలు కనిపించి మాయమవుతాయి. దీనికి మంత్ర సిద్ధి ఉంటుంది.

nadi jyothishyam2000 సంవత్సరాల క్రితం జీవించిన అగస్త్య మహర్షి నాడీ జ్యోతిష్యానికి నాంది పలికారు. అనంతరం కౌశిక మహర్షి, శివ వాగ్గేయకారులు నాడీ జ్యోతిష్యానికి కొనసాగించారు. నాడీ జ్యోతిష్యం చెప్పేందుకు పురుషులకు కుడి చేతి బొటనవేలి ముద్రను, స్త్రీలకు ఎడమ చేతి బొటనవేలి ముద్రను ప్రామాణికంగా తీసుకుంటారు. వేలి ముద్ర ఆధారంగా వివరాలతో వారి పేరు, జీవితభాగస్వామి పేరు, తండ్రి, తల్లి, సోదరీమణులు, సోదరుల పేర్లు మరియు సంఖ్యలు, వారి ఆస్థి, విద్యార్హతలు మరియు అనేక విషయాలను తాళపత్రాలు తెలియజేస్తాయి. పై విషయాలు ఖచ్చితంగా తెలియజేయబడ్డాయనే నిర్థారణకు వచ్చిన అనంతరం భవిష్యత్తులో దేనికి సంబంధించిన వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అంశం కోసం శోధన ప్రారంభమవుతుంది.

ఇది ఇలా ఉంటె, బీవీ రామన్ గారు 1938 లో శ్రీనివాసాచారి అనే నాడీ జ్యోతిష్కుని కలిసారు. ఆయన వద్ద బుధనాడి అనేగ్రంథం ఉన్నది. ఈయన జీవితం అంతా విషాదంతో నిండి ఉంది. మూడుసార్లు పెళ్లిచేసుకున్నాడు. కానీ మొదటి ఇద్దరు భార్యలు విషాద పరిస్థితులలోచనిపోయారు. శ్రీనివాసాచారిగారి అభిప్రాయం ప్రకారం నాడిగ్రంథం ఇంటిలోఉండరాదు. ఒకవేళ ఉంటే, ఆ కుటుంబం మీద శాపం ఉంటుంది. చాలా నాడీగ్రంథాలు క్షుద్ర మంత్రములపైన ఆధారపడి ఉంటాయి. ఆయా క్షుద్ర దేవతలను ప్రతి రోజూ తృప్తిపరచాలి. తేడా వస్తే ఫలితములు దారుణంగా ఉంటాయి. వాటిని తృప్తిపరిచే విధానాలు వేర్వేరుగా ఉంటాయి.

nadi jyothishyamశశికాంత జైన్గారు వారి పుత్రులు ఆశ్చర్యకరమైన జ్యోతిష్కులు. ఎదుటి మనిషి ఏమి అడుగబోతున్నాడో గ్రహించి ముందుగానే వారి మనసులో ప్రశ్నను , దానికి జవాబును చెప్పగలరు. ఈ రకంగా ఒకసారికాదు, కొన్నివందలసార్లు వీరు పరీక్షలకు నిలబడి విజయం సాధించి చూపారు. వీరికి కర్ణపిశాచిని మంత్రసిద్ది ఉందని జనం అనుకునేవారు.

ఈ జ్యోతిష్కులలో కొందరికి పంచాంగుళీ మంత్రసిద్ధిఉంటుంది. పంచాంగుళీ మాతహస్తసాముద్రిక విధానానికి అధిదేవత. ఈ దేవతా కటాక్షం వల్ల ఫలితములుఎక్కువ కష్టపడకుండా తేలికగా చెప్పవచ్చు. ఈమె అంత ప్రమాదకారికాదు. కొంచం సాత్వికదేవత. అసలు వీరందరూదేవతలు కారు. దేవతల కంటే కొంచం స్థాయి తక్కువవారు. కాని మానవాతీతశక్తులు ప్రసాదించ గలిగినవారు. వీరిలోఎక్కువ మంది భయంకరమైన ఆకారం కలిగి ఉంటారు. భయాన్ని జయించిన సాధకుడు మాత్రమె వీరిదర్శనాన్ని తట్టుకోగలుగుతాడు. లేకపోతే వీరి దర్శనం వల్ల మతిభ్రమణం వంటి చేదు పరిణామాలు కలుగుతాయి.

మంత్ర నాడి తెలిసిన వారికి సాంప్రదాయ జ్యోతిష్యం కూడా కొంత తెలిసి ఉంటుంది. కొందరికి అసలుతెలియదు. రెండవరకానికి చెందిన వారు పైశాచికభాష చదవటం నేర్చుకొని ఉంటారు. తాళపత్రంలో ఉన్న భాషను, లేక అప్పటికప్పుడు కనిపించి మాయం అయ్యే మాటలను చదివిచెప్పగలరు. అంతవరకే వారి ప్రజ్ఞాపాటవాలు పనిచేస్తాయి. దానిని మించి వారికి జ్యోతిష్యజ్ఞానం ఉండదు.

nadi jyothishyamతమిళ నాడీజ్యోతిష్కులలో చాలా మంది క్షుద్రమంత్రములు తెలిసినవారు ఉంటారు. వారు కొన్నిరోజులు బాగా ధనం సంపాదిస్తారు. కాని చివరకు, వీరి జీవితములు విషాదంగా ముగుస్తాయి. దిక్కులేని మరణం వీరిని వరిస్తుంది. దానికి కారణం ఆశ. ఆశతో ఉన్నవీ లేనివీ చెప్పి పృచ్చకుల వద్ద ధనం గుంజుతారు. తెలిసీ తెలియని రెమెడీస్ చెప్పి పృచ్చకుని కర్మలో వీరూ భాగం మూటగట్టుకుంటారు. కనుక లోకులకర్మ వీరి నెత్తిన పడుతుంది. అందుకే మంత్ర నాడీ గ్రంథముల జోలికిపోవడం శ్రేయస్కరం కాదు. వాటిని ఇంటిలో ఉంచుకొనుట దోషప్రదం. ఏరకంగా చూచినా ఈవిధానం మంచిది కాదు. ఒకవేళ ఈ విధానాన్ని అనుసరించాలంటే ఆ వ్యక్తీ సంసారజీవితానికి దూరంగా ఉంటూ, అనేక నియమనిష్టలు పాటిస్తూ ఒక బికారిలా బతకాలి. అప్పుడే లోకుల కర్మ అతనికి సోకకుండా ఉంటుంది. అలా కాకపోతే అతని జీవితంలో భయంకరమైన ఎదురుదెబ్బలు తగలటం ఖాయం.

వైదీశ్వరన్ కోయిల్, కంచి, మద్రాసు, కుంభకోణం, ఇంకా తమిళనాడు లోని అనేక నగరాలలో నాడీజ్యోతిష్కులు ఎక్కువగా కనిపిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR