పిల్లలు మట్టి తింటున్నారా… ఇలా మాన్పించండి!

చిన్న పిల్లలు చేతికి ఏది దొరికితే దాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి బాగా ఉంటుంది. అందుకే మట్టి కూడా నోట్లో పెట్టేసుకొని తినేస్తుంటారు. ఈకాలం వాళ్ళు అసలు ముట్టనివ్వట్లేదు కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మట్టే కదా తిననివ్వు మంచిదే అంటారు. చిన్ని కృష్ణుడు మన్ను తిన్నట్టు మురిసిపోతుంటారు. అయితే కృష్ణుడు అపుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం మట్టి తిన్నాడు. అప్పుడు మట్టి అంటే కూడా స్వచ్ఛమైనదే. మన్ను మంచిదై ఉండాలే కాని, దాన్ని రుచి చూస్తే తప్పేం లేదట.అయితే అది మోతాదు మించకూడదు.

మంచి మట్టి రుచి వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, మధుమేహం, ఊబకాయం లాంటివి దరిచేరవట.అందుకే అంటారు, మట్టిలో బ్రతికే రైతుకున్న అరోగ్యం, జంక్ ఫుడ్ తింటూ బ్రతికే పట్నం వాళ్ళకి ఎక్కడ ఉంటుందని. కానీ అప్పట్లో పంటపొలాల మట్టిలో దొరికే మినరల్స్ ఇప్పుడున్న మట్టిలో అసలు ఉన్నాయా? ఇప్పుడున్న కలుషితమైన వాతవారణం, మట్టిలో కలిసపోతున్న మెటల్స్, ప్లాస్టిక్ ని దృష్టిలో పెట్టుకోని చూస్తే, పిల్లలని మట్టి తినకుండా అడ్డుకోవడమే మంచిది అని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇప్పుడు మన్నులో మినరల్స్ కాదు, బ్యాక్టీరియా దొరుకుతోంది.

bacteriaఈరోజుల్లో మట్టి తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే చిన్న పిల్లలే కాదు, పెరుగుతున్న పిల్లలు, పెద్దవాళ్ళు కూడా మట్టి తినడానికి అలవాటు పడిపోయి ఉన్నారు. పిల్లల్ని ఎంత మాన్పించాలనుకున్నా తెలియకుండా తినడానికి ప్రయత్నిస్తారు. ఇక పెద్దలైతే ఆరోగ్యం పాడవుతుందని తెలిసి తెలిసి తింటారు. దీనికి కారణం ఏమిటీ అంటే… ఇలా మట్టి తినడాన్ని మృద్బక్షణ అంటారు. ఇది సాధారణంగా రక్తహీనత, అజీర్తి, నులి పాములు, ఏలికపాములు చిన్న పిల్లల కడుపులో ఉన్నప్పుడు ఈ లక్షణం వస్తుంది.

anemiaముఖ్యంగా పోషకాహార లోపం వలన కూడా ఇది వస్తుంది. మట్టి, సుద్దా, నాముసుద్దా, బలపాలు తినాలని అనిపిస్తుంది. ఇంతటితో ఆగుతుందా అంటే కానే కాదు. ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని నిరోధించేందుకు మందులు వాడాలి. కాచిన సింధూరం 50 గ్రా, కాంతలోహ 50 గ్రాములను తేనెతో కలిపి రెండు పూటలా వేయాలి. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇందులో కూడా తీవ్రత ఉంటుంది. ఏలికపాములు, నులి పురుగులు ఉన్నట్లయితే ఒక్క గ్రాము విడంగాది చూర్ణం, 50 గ్రాముల కాసిన సింధూరం తేనేతో కలిపి రెండు పూటలా తినిపించాలి. పండ్ల రసాలు, మామూలు భోజనం, పౌష్టికాహారం ఇవ్వాలి.

fruits juiceఆయుర్వేద డ్రై ఫ్రూట్స్ పొడి పిల్లల్ని మట్టి మాన్పించడానికి చక్కగా పని చేస్తుంది. దానికోసం బాదం పప్పు – 100 గ్రాములు, పిస్తా పప్పు – 100 గ్రాములు, జీడిపప్పు – 100 గ్రాములు, సారపప్పు – 100 గ్రాములు, ఆక్రోటు – 100 గ్రాములు, పుచ్చకాయ గింజలు – 100 గ్రాములు, దోసకాయ గింజలు – 100 గ్రాములు, కీర దోస గింజలు – 100 గ్రాములు, ఎండు ఖర్జూరం – 100 గ్రాములు, ఎండు ద్రాక్ష – 100 గ్రాములు, తామర గింజలు పప్పు – 100 గ్రాములు, చిల్గోజ – 100 గ్రాములు, లవంగాలు – 10 గ్రాములు, యాలకులు – 10 గ్రాములు, దాల్చిన చెక్క – 10 గ్రాములు
బెల్లం – 1230 గ్రాములు, తేనె – 500 గ్రాములు, నెయ్యి – 500 గ్రాములు తీసుకోని వాటన్నింటిని దంచి పొడి గా తయారు చేసుకోవాలి.

 

dry fruitsఇలా తయారుచేసుకున్న అన్ని పొడులను ఒక దాంట్లో వేసి కలిపి పై వస్తువులకు సమానంగా మంచి బెల్లం తురుము ను 1230 గ్రాములు కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో అర కిలో తేనె, అర కిలో నెయ్యి వేసి లేహ్యం లా తయారు చేసుకోవాలి.. ఇలా తయారుచేసుకున్న లేహ్యాన్ని పిల్లలకు ఉదయం రాత్రి భోజనానికి ముందు అరస్పూన్ ఇవ్వాలి. అలాగే పెద్దలకు అయితే ఉదయం రాత్రి నిమ్మ కాయ సైజు లో పాలల్లో కలిపి తీసుకోవాలి. వీటితోపాటు పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR