మనలో దైవాన్ని నమ్మే వారు ఉన్నట్లే కొందరు ఆత్మలను దయ్యాలను నమ్మేవారు కూడా ఉన్నారు. అయితే నిజంగా దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా అంటే? ఇప్పటికి భిన్న వాదనలే వినిపిస్తుంటాయి. ఇది ఇలా ఉంటె చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఒక నెత్తుటి చెరువు ఉంది? ఇందులో దయ్యాలు ఉంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. మరి దయ్యలా నిలయమైన ఆ రక్తపు చెరువు ఎక్కడ ఉంది? అక్కడి స్థానికులు అందులో దయ్యాలు ఉన్నాయని ఎందుకు అంటున్నారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర చిలి దేశంలోని కెమినా నగరానికి 147 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,700 ఎత్తులో ఉన్న మర్మమైన ఈ చెరువు లోని నీరు నెత్తుటి గంగు లేక ఎర్ర రంగు నీటితో నిండి ఉంటుంది. ఏ మ్యాపులోనూ చూపబడని ఈ చెరువు అక్కడున్న నివాసకులకు మాత్రమే ఉందని తెలుసు. అయితే 2009 వరకు చిలి దేశ పర్యాటక సంఘానికి కూడా ఈ చెరువున్న సంగతి తెలియలేదు.
పూర్వం ఇక్కడ అయమరా జాతి సంస్కృతి వారు నివసించేవారు. వీరు వారి సంస్కృతి గురించి, దేశ ఆచారాల గురించి, దేశ పెద్దల గురించిన రహస్యాలను కాపాడేవారట. ఈ విషయం గూడా ఈ మధ్యే తెలుసుకోగలిగారు. ఈజిప్ట్ పిరమిడ్ సమాధుల శాపాల గురించిన మర్మం ఎలా రహస్యంగా ఉంచబడ్డయో ఈ చెరువు గురించిన శాపాం గూడా అంతే రహస్యంగా ఉంచబడింది. అందువలనే ఈ చెరువు ప్రపంచానికి తెలియలేదని చెబుతున్నారు.
ఇక ఈ చెరువులోని నీటిని ముట్టుకుంటే, లేక ఈ చెరువు దగ్గరకు ఎవరు వెళ్లినా వారు శాపానికి గురవుతారంటా. అందువలనే ఈ చెరువు గురించి ఎవరికీ చెప్పలేదని చెబుతున్నారు. అందువలనే ఈ చెరువు ఏ మ్యాపులోనూ కనబడలేదు. ఇంకా ఈ చెరువు నీరు తాగినందు వలనే అయమరా జాతి సంస్కృతి వారిలో అనేక మంది చనిపోయేరని చెబుతారు. ఈ ఎర్ర చెరువు ను చుట్టి ఒక పచ్చ నీటి చెరువు మరియూ పసుపు నీటి చెరువూ కూడా ఉన్నాయి. ఈ చెరువుల దగ్గరకు ఎవరైనా వెళితే ఆ చెరువుల లోని నీరు బుడగలతో పైకి ఎగతన్నుకుని వస్తుంటాయి. అందువలన ఈ చెరువులు దెయ్యాలకు సొంతమని అక్కడి ప్రజల విశ్వాసం.