పురుషులు బ్రెజిల్ నట్స్ తింటే ఏమవుతుందో తెలుసా?

డైటింగ్ చేసేవాళ్లు మెనూలో కచ్చితంగా ఉండేవి నట్స్. ఇవి తీసుకోవడం వలన ఆకలి తగ్గడమే కాకుండా ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. అయితే నట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో కొన్ని అరుదైన రకాల గురించి అందరికీ తెలియకపోవచ్చు. వాటిలో బ్రెజిల్ న‌ట్స్ కూడా ఒక‌టి.
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌ అడవుల్లో ఓ జాతి చెట్టు నుంచీ వీటిని పండిస్తున్నారు. అందుకే వీటిని బ్రెజిల్ నట్స్ (బ్రెజిల్ గింజలు లేదా బ్రెజిల్ పప్పులు) అని పిలుస్తున్నారు. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌తోపాటూ… దక్షిణ అమెరికాలోని వెనిజులా, కొలంబియా, పెరూలో కూడా పండిస్తున్నారు. మిగతా ఖండాల్లో కూడా వీటిని పండించే ప్రక్రియ మొదలైంది.
బ్రెజిల్ న‌ట్స్‌లో ఉండే పోష‌క‌ విలువ‌ల‌, అవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి చాలామందికి తెలియదు. వాటి గురించి తెలిస్తే ఖ‌చ్చితంగా అంద‌రూ వాటిని డైట్‌లో చేర్చుకుంటారు.సెలెనియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సి, విట‌మిన్ ఇ, విటిమ‌న్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు బ్రెజిల్ న‌ట్స్‌లో నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి బ్రెజిల్ న‌ట్స్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.
బ్రెజిల్ నట్స్‌ లోసెలెనియం పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మన శరీరం లో వాపులు,మంటలు, నొప్పులను తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తిపెరిగేలా చేస్తాయి. గుండె కు రక్షణ కల్పిస్తాయి. చర్మాన్నీ కాపాడతాయి. అధిక బరువు తగ్గేలా చేస్తాయి. టెన్షన్ తగ్గేలా చేస్తాయి. వీటిని తినడం వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
రెగ్యుల‌ర్‌గా డైట్‌లో ఈ న‌ట్స్‌ను చేర్చుకుంటే బ‌ల‌హీన‌మైన ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి. సంతాన‌లేమితో బాధ ప‌డే దంప‌తుల‌కు బ్రెజిల్ న‌ట్స్ ఒక వ‌రంగా చెప్పుకోవ‌చ్చు. వీటిని ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకుంట .పురుషుల్లో వీర్య క‌ణాల వృద్ధి జ‌రుగుతుంది.మ‌రియు స్త్రీలో గర్భాశయ స‌మ‌స్య‌ల‌ను నివారించి సంతానోత్పత్తిని పెంచుతాయి.
బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం మన శరీరానికి ఎంతో అవసరం. దాని వల్ల విషపూరిత వ్యర్థాలు మన శరీరంలోకి రాకుండా ఉంటాయి. బాడీని చల్లగా ఉంచడంలో సెలెనియం ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది సెలెనియం కొరతతో బాధపడుతున్నారు. బ్రెజిల్ నట్స్ చెడు కొలెస్ట్రాల్ అంతు చూసి… మంచి కొవ్వును పెంచి, గుండెను కాపాడతాయి. మనకు ఎంతో అవసరమైన ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌ ఈ పప్పుల్లో ఉంటాయి. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, విటమిన్ E కూడా కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.
మూడ్ బాగోని వాళ్లు, టెన్షన్‌తో ఉండేవాళ్లు బ్రెజిల్ నట్స్ ఓ నాలుగు తింటే చాలు… బ్రెయిన్‌లో సెరొటోనిన్ కెమికల్ చక్కగా పనిచేసేలా చేస్తాయి. అంతే బ్రెయిన్ చురుగ్గా మారి… టెన్షన్, తలనొప్పి, ఆందోళన వంటివి మాయమవుతాయి. చక్కటి నిద్ర పడుతుంది కూడా. మన శరీరంలో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి అవ్వాలంటే ఆ థైరాయిడ్ గ్రంథి చక్కగా ఉండాలి. బ్రెజిల్ నట్స్ థైరాయిండ్ గ్రంథి బాగా పనిచేసేలా చేస్తుంది.
అంతేకాదు, ప్ర‌తి రోజు బ్రెజిల్ న‌ట్స్‌ను తింటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది. ఈ గింజలు ముసలితనం రాకుండా అడ్డుపడతాయి. బ్రెజిల్ నట్స్‌లో ఉండే L-ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్   జుట్టును కాపాడేందుకు మరియు మగాళ్లకు బట్టతల రాకుండా చేసే అందుకు బాగా ఉపయోగ పడుతుంది. జుట్టు బాగా పెరగాలంటే వీటిని బాగా తినవలిసిందే.
మన శరీర కణాలు పాడవకుండా చేసే లక్షణం బ్రెజిల్ నట్స్‌కి ఉంది. కణాలు పాడైతే వాటిని బాగుచేస్తాయి కూడా. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో చాలా మందికి కేన్సర్ సోకుతోంది. కారణం కణాలు పాడైపోతుండటమే. ఆ భయంకరమైన వ్యాధి బారిన పడకుండా మనకు ఎంతో మేలు చేస్తాయి ఈ బ్రెజిల్ నట్స్. కాబ‌ట్టి, ఇక‌పై బాదం, పిస్తా, జీడిప‌ప్పు వంటి న‌ట్స్ మాత్ర‌మే కాకుండా బ్రెజిల్ న‌ట్స్ నూ డైట్‌లో చేర్చుకోండి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR