మాంసాహారం తిని దేవాలయాలకు వెళ్ళకూడదు… కారణం??

ఈ రోజుల్లో పండుగలు, వివిధ సందర్భాల్లో గుడికి వెళ్తున్నాం. కానీ ప్రతి రోజు గుడికి వెళ్లే పద్దతిని మన పెద్దలు మనకు పూర్వం నుంచే అలవాటు చేశారు. గుడికి వెళ్ళడమంటే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలుకూడా ఉన్నాయి. దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలన్న విషయంపై వేదాలు ఏం చెబుతున్నాయి. మరియు పాటించాల్సిన నియమాలేంటి అన్న విషయాలను తెసుకోవడం చాలా అవసరం.

templeమనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

ఈ నేపథ్యంలో గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలలో తమో,రజో గుణాలకు సంబందించిన పదార్ధాలు ఉంటాయి. తమో,రజో గుణాలంటే కోపం,కామం, కలిగి ఉండటం.

angerఈ గుణాలు ఉండటం వల్ల సత్వ గుణం తగ్గిపోతుంది. దేవాలయం మరియు దైవారాధన చేసే సమయంలో సత్వ గుణం కలిగి ఉండటం ముఖ్యం. తమో,రజో గుణాల కారణంగా మనో నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది. దాంతో దైవ కార్యాలు సఫలం కావు.

అందువల్ల తమో,రజో గుణాలను కలిగించే ఆహారాలను తీసుకోకూడదు. పాలు,పండ్లు,కూరగాయల వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

milk and fruitsఇక్కడ మరొక విషయం ఏమిటంటే గుడ్డు మరియు మాంసాహారంలోనే కాకుండా ఉల్లి,వెల్లుల్లి, మసాలా దినుసులతో కూడా తమో,రజో గుణాలు ఉంటాయి. అందువల్ల గుడికి వెళ్లే సమయంలోను మరియు దైవ కార్యాలు చేసే సమయంలోను తమో,రజో గుణాలు ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.

ginger and garlic

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR