ఈసారి ఉల్లిపాయ కొస్తే పొట్టు పడేయకండి!

ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు అనే సామెత తెలియని తెలుగు వారుండరు. ఉల్లిపాయ వలన అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ప్రతి రోజూ కూరల్లో ఉల్లిపాయ వేస్తూ ఉంటాం. కొందరైతే పచ్చి ఉల్లిపాయాలని కూడా మజ్జిగలోనూ, మాంసాహారంలోనో నంజుకుంటారు. ఉల్లిపాయని ఎలా తిన్నా దాని వలన లాభమే తప్ప నష్టం ఉండదు.

onion peelఅయితే ప్రతి రోజూ వంటింట్లో ఉల్లి పాయలు కోసే వారు ఉల్లి తొక్కును పడేస్తూ ఉంటారు. ఉల్లిపాయ పై పొర ఎండిపోయి ఉంటుంది. సాధారణంగా ఈ పొట్టును తీసి చెత్తబుట్టలో వేస్తుంటారు. కానీ ఆ ఉల్లి తొక్కతోనూ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి పొట్టుతో అటు ఆరోగ్యం, ఇటు అందం ఏకకాలంలో రెండూ పొందవచ్చు.

ఒంట్లో ఉన్న చెడు కొలెస్టరాల్ పోవాలంటే ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసి తాగాలి. దీని ద్వారా చెడు కొలెస్టరాల్ పోవడమే కాకుండా మంచి కొలెస్టరాల్ వస్తుంది. ఇక చెడు కొలెస్టరాల్ పోయిందంటే గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గిపోతుంది. ఉల్లిపొట్టు సూప్‌ యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్‌ ఏజెంట్‌గా ఉపయోగపడుతుంది. అందుకే శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గిపోతాయి.

cholestrol blockingదీనికితోడు ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాల ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన శరీరంలో క్యాన్స‌ర్ కణాల వృద్ధి జరగకుండా ఈ ఉల్లిపాయ పొట్టు మన శరీరానికి మనకు తెలియకుండానే ఎంతో మంచి మేలు చేస్తుంది. ఉల్లి తొక్కల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయి.

ఒకవేళ చర్మంపై దద్దురులు, ఎలర్జీ వంటివి వచ్చినట్లైతే వాటికి ఉల్లి పొట్టు ఔషదంగా పని చేస్తుంది. ఉల్లిపొట్టుని రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే పొట్టుని పడేసి ఆ నీటిని చర్మంపై రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గు ముఖం పెడతాయి. చర్మసమస్యలు ఉన్నవారు ఆ నీటిని రాసుకుని ఓ అరగంట ఆగి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.

injuries on handsజుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య ఉన్నా.. ఉల్లి తొక్కలను మెత్తగా నూరి తలకు పట్టించాలి. తలస్నానం చేసే ముందు జుట్టుని తడిపి దానిపై ఉల్లి పొట్టుతో ఓ పది నిమిషాల పాటు మర్దనా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ధృడమైన అందమైన జుట్టు సొంతం అవుతుంది.

hairfall and dandruffఫ్యాన్ తిరుగుతున్నా చెవిలో దోమలు గుయ్ మంటూ నిద్ర పోనివ్వకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు ఓ గిన్నెలో నీరు తీసుకుని వాటిలో ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పెడితే దొమలు ఆ వాసన భరించలేక ఇంట్లోకి వచ్చే సాహసం చేయవు. ఉల్లిపాయ పొట్టు నుండి వచ్చే వాసన అంటేనే ఈగలు, దోమలకు చిరాకు. ఉల్లి తొక్కలు మొక్కలకు కూడా మందు. మొక్కల మొదళ్లలో ఉల్లి తొక్కలను ఉంచినట్లైతే వాటికి మంచి ఎరువులా పనిచేస్తుంది. చెట్టునిండా పూలు పూసి పరిమళాలను వెదజల్లుతుంది.

mosquitosపండ్ల మొక్కలు, పూల మొక్కలకు పోషక లోపం లేకుండా అన్ని పోషకాలనూ అందించేందుకు ఉల్లి పొట్టుతో తయారు చేసుకునే సేంద్రియ ఎరువు ఉపయోగపడుతుంది. పూత రాలుడు సమస్యను ఆపుతుంది. ఉల్లి పొట్టులో పొటాషియం, ఫాస్ఫరస్, జింక్‌ పుష్కలంగా, స్వల్పంగా గంధకం ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు పోషక లోపం లేకుండా, వేరు వ్యవస్థ బాగా విస్తరించి, ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి.

onion peel fertilizer for plants

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR