ఈ సుగంధ ద్రవ్యాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయా?

డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది. ప్రతిసారీ… బాడీలోని బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇందుకు చక్కటి ట్రీట్‌మెంట్, మంచి లైఫ్ స్టైల్, మంచి ఆహారం, బరువు తగ్గే వ్యాయామాలు అవసరం.

sager levelsడయాబెటిస్ ఉన్నవారికి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోవచ్చు లేదా ఉత్పత్తి అవుతున్న ఇన్సులిన్ సరిగా ఉపయోగపడకపోవడమైనా జరగవచ్చు. డయాబెటిస్ ట్రీట్‌మెంట్ తీసుకునేవారికి కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు మేలు చేస్తాయి. వాటితో డయాబెటిస్ పూర్తిగా నయం అయిపోదు. కానీ అవి డయాబెటిస్ లక్షణాల్ని గుర్తించి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి.

గిలాయ్ మొక్క :

గిలాయ్ మొక్కఆయుర్వేదంలోని గిలాయ్ మొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బాడీలో కణాల్ని రక్షిస్తూ వ్యర్థాలు, చెడు క్రిముల అంతు చూడగలదు గిలాయ్ మొక్క మార్కెట్‌లో గిలాయ్ పొడి దొరుకుతుంది. ఓ కప్పు వాటర్‌లో పొడి వేసి రాత్రంతా ఉంచి తెల్లారి తాగేస్తే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ ఐదు రకాల్లో ఏదేది వాడాలో, ఎంత వాడాలో ఓసారి డాక్టర్‌ని కలిసి, వాళ్ల సూచనలు పాటించడం మేలు. సొంత నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాకపోవచ్చు.

కలబంద :

కలబందమన ఇళ్లలో ఉత్తినే పెరిగే కలబంద మొక్క నిండా ఔషధాలే. అది జుట్టు, చర్మానికి రక్షణతోపాటూ… బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల్ని బాగుచేసే, రక్షించే పనిని అలోవీరా గుజ్జు చేస్తుంది. కొద్దిగా నీటిలో అలోవీరా గుజ్జు వేసి… జ్యూస్‌లా చేసుకొని గడగడా తాగేయడమే. డాక్టర్‌ని అడిగి వాళ్ల సూచన ప్రకారం చేయడం మంచిది.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్కచక్కటి సువాసన వచ్చే దాల్చిన చెక్క… కొద్దిగా తియ్యగా కూడా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. శరీరానికి చెడు సూక్ష్మక్రిములు చేరకుండా చెయ్యగలదని తెలిసింది. కూరల్లో వాడే దాల్చిన చెక్కను… టీల్లో కూడా పొడిలా వేసుకొని తాగవచ్చు. దాల్చిన చెక్క… చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది ఎంత వాడాలో ముందుగా డాక్టర్‌ను కలిసి సలహా తీసుకోవడం మేలు.

మెంతులు :

మెంతులుఇండియాలో అద్భుత సుగంధ ద్రవ్యాల్లో మెంతులు ఒకటి. వీటిలో ఫైబర్, కెమికల్స్… పిండి పదార్థాలు, గ్లూకోజ్ వంటివి వేగంగా జీర్ణం అవ్వకుండా చేస్తాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. మెంతుల ఆకులు కూడా మంచివే. వాటిని కూరల్లో వేసుకొని తినవచ్చు. మెంతుల్ని నీటిలో నానబెట్టి… ఆ నీరు తాగినా మేలే. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చెయ్యడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి.

కాకరకాయ :

కాకరకాయకాకర కాయ ఫ్రై, కాకరకాయ కూరలు తింటే ఎంతో మంచిది. కాకరగాయ గుజ్జును జ్యూస్‌లా తాగినా మేలే. ఈ జ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని తగ్గిస్తోంది. టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చెయ్యాలంటే… కాకరకాయ వాడటం మేలు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR