ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగాలంటే ఇలా చేయండి

రక్తంలో ప్లేట్‌లెట్స్ ఉండడం చాలా కీలకం. ఇవి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. డెంగ్యూ, మలేరియా, ఇలా ఏ వైరల్ ఫీవర్ వచ్చినా శరీరంలో ప్లేట్ లెట్స్ తీవ్రంగా తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో వైరల్ ఫీవర్ నెగిటివ్‌‌ వచ్చినా చాలామందిలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతుంది. దాంతో ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. లోబ్లడ్ ప్లేట్ లెట్స్ ను టెక్నికల్ గా థ్రోమ్బోసైటోఫినియా అని పిలుస్తారు.

ప్లేట్‌లెట్స్ప్లేట్‌‌లెట్స్ బాడీలోని రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. ప్లేట్‌లెట్స్ తగ్గితే రక్తం గడ్డకట్టదు. ఈ కారణంగా.. శరీరంలోని వివిధ భాగాలకు రక్తస్రావం ఎక్కువగా అయి మనుషులు వీక్ అవుతారు. సాధారణంగా ప్రతి ఒక్కరి రక్తంలో 2.5 లక్షల నుంచి 4 లక్షల ప్లేట్ లెట్స్ ఉండాలి. ప్లేట్ లెట్స్ మన శరీరంలో 5 నుంచి 9 రోజుల వరకు జీవిస్తాయి. ఇవి తగ్గితే కౌంట్ తగ్గిందని అర్ధం చేసుకోవచ్చు.

ప్లేట్‌లెట్స్ప్లేట్‌లెట్స్ తగ్గాయని సూచించే లక్షణాలు..

  • నల్లగా విరేచనాలు అవ్వడం
  • చర్మం ఎర్రగా మారితే ప్లేట్‌లెట్స్ తగ్గినట్లే..
  • చిగుళ్ల నుంచి రక్తం కారినా ప్లేట్‌లెట్స్ తగ్గినట్లుగా భావించాలి.
  • ముక్కునుంచి రక్తం కారడం
  • చర్మంపై రాషెస్ రావడం

చాలా సందర్భాల్లో ఇలా ప్లేట్‌లెట్స్ తగ్గి మృత్యుఒడికి చేరినవారు ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్య తగ్గితే వెంటనే అప్రమత్తమవ్వాలి. రక్తం ఎక్కించుకోవడమో.. హెల్దీ డైట్ తీసుకోవడమో చేయాలి. అయితే, సమస్య తీవ్రత ఎక్కువున్న కారణంగా రోగులందరికీ సరిపోయే రక్తం ఏ బ్లడ్ బ్యాంక్ కూడా సరఫరా చేయలేకపోతోంది. ఒకవేళ ఎక్కించినా మనలోని రోగనిరోధకశక్తి బలహీనంగా ఉండడం కారణంగా మళ్లీ సమస్య మొదలు కావొచ్చు. అందుకే సహజంగానే మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ప్లేట్‌లెట్స్బొప్పాయి పండ్లు, బొప్పాయి ఆకులు మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి రోజూ బాగా పండిన బొప్పాయిని తినడం లేదా బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. బొప్పాయి ఆకుల రసం తాగడానికి కొద్దిగా చేదు అనే భావన కలిగినా అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగవచ్చు. అయితే దీన్ని పావు టీస్పూన్‌ మోతాదులోనే వాడాలి. ఎక్కువైతే అనారోగ్య సమస్యలు వస్తాయి.

ప్లేట్‌లెట్స్రక్తాన్ని పెంచే క్యారెట్.. ప్లేట్‌లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని తేలింది. ఈ క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలో నైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది.

ప్లేట్‌లెట్స్దానిమ్మ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రక్తహీనతతో బాధపడేవారిని దానిమ్మ తినమని సలహా ఇస్తారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తికి పెంచుతాయి. అంతేనా దానిమ్మని రెగ్యులర్‌గా తింటే ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలింది. కాబట్టి ప్లేట్‌లెట్స్‌ని పెంచుకునేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ప్లేట్‌లెట్స్నిమ్మకాయలో మనకు అధిక మోతాదులో విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి మన శరీరంలో ప్లేట్ లెట్ సంఖ్యను పెంచడమే కాకుండా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కనుక రోజుకు రెండు సార్లు ఒక టీస్పూన్‌ నిమ్మరసం తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

ప్లేట్‌లెట్స్ఉసిరిలో కూడా అధిక భాగం విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయలో లభించే ప్రయోజనాలన్నీ ఉసిరి ద్వారా మనకు అందుతాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందు వల్ల ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను తాగితే మంచిది. లేదా ఉసిరికాయ పొడిని రోజుకు రెండు సార్లు ఒక టీస్పూన్‌ మోతాదులో తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

ప్లేట్‌లెట్స్ఎక్కువగా వంటల్లో ఉపయోగించే గుమ్మడిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్‌లెట్స్‌ని పెంచి రెగ్యులేట్ చేసే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ప్రోటీన్ రెగ్యులేట్ అవ్వడమంటే ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరిగినట్లే. గుమ్మడి గింజలు కూడా ప్లేట్‌లెట్స్‌ని పెంచుతాయని తేలింది.

ప్లేట్‌లెట్స్బీట్‌రూట్‌ మన శరీరంలో ప్లేట్ లెట్ సంఖ్యను పెంచి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఒక గ్లాస్ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

ప్లేట్‌లెట్స్గోధుమ గడ్డి.. ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా.. ఈ మధ్యకాలంలో గోధుమగడ్డి అనే ఆహారం గురించి ప్రతీ ఒక్కరూ ఆరాతీస్తున్నారు.. అవును ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని అందులో కాస్తా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్‌లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్లేట్‌లెట్స్రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది. ఆప్రికాట్ ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్. రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్ లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.

ప్లేట్‌లెట్స్శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను నివారించడానికి,ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి కలబంద రసం దోహద పడుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే అర కప్పు మోతాదులో కలబంద రసం తాగితే మంచిది.

ప్లేట్‌లెట్స్కర్జూరం ఎండుఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్ లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి. లివర్ ప్లేట్ లెట్ ను అభివృద్ది చేయడంలో మరో ఆహార పదార్థం లివర్. అయితే లివర్ ను బాగా ఉడికించి తీసుకోవల్సి ఉంటుంది.

ప్లేట్‌లెట్స్పాలకూరలో విటమిన్‌ కె ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్త స్రావం అధికంగా కాకుండా కాపాడుతుంది. రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. అలాగే పాలకూర జ్యూస్‌ను రోజూ ఉదయం తాగడం వల్ల రక్తంలో ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

ప్లేట్‌లెట్స్విటమిన్‌ బి12 అధికంగా ఉండే కోడిగుడ్లు, మాంసం, చికెన్‌ వంటి పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్‌ డి కూడా లభిస్తుంది. ఫోలేట్‌, బి12, విటమిన్‌ కె అధికంగా ఉంటాయి. అందువల్ల పాలను రోజూ తాగితే ప్లేట్‌ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఒక గ్లాస్‌ పాలు తాగితే చాలు, ప్లేట్‌ లెట్ల సంఖ్య పెరుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR