మెదడు షార్ప్ గా పనిచేయాలంటే ఇలా చేయండి!

మనిషికి ఇతర జీవులకి ఉన్నా పెద్ద తేడా ఆలోచన. మనిషి జ్ఞానాన్ని, నాపుణ్యాన్ని మేధస్సుగా మర్చి ఎన్నో కొత్త విషయాలను కనుగొంటున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నాడు. కానీ దాని వలన ఎదురయ్యే నష్టాల గురించి ఆలోచించడం లేదు. మనకు సహజ సిద్ధంగా ఏర్పడిన మేధస్సు పూర్వికుల నుంచి సంక్రమించిందే.కానీ ఇప్పుడు మనకంప్యూటరింగ్ పవర్‌తో జీవన విధానం పూర్తిగా మారిపోతోంది. మన మేథా శక్తిని కోల్పోతున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే టెక్నాలజీ అనే ట్రాప్‌లో ఇరుక్కుపోతున్నాం. ప్రస్తుత యువత సంగతి అయితే మరీ ఎక్కువ.
మరిచిపోం అనే పదం మన జీవితంలో భాగమైపోయింది. ఎవరో తెలిసిన వాళ్లు పక్కనే వెళ్తారు. ఇంటికి వెళ్లి.. టీవీ చూస్తూ.. ఎవరబ్బా.. అని ఆలోచించినా.. అస్సలు వాళ్లేవరో గుర్తురారు. కొంతమందిని చూసినప్పుడు ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది. వాళ్ళను ఏదో ఒక సమయంలో కలిసే ఉంటాం, కానీ ఎవరో గుర్తుకురాదు. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎప్పుడూ వెళ్లే.. ప్రదేశమే.. ఈ స్థలం పేరు అని పక్క వాళ్లకు చెబుతామనుకుంటాం. కానీ.. గుర్తుకురాక తల గొక్కుంటాం. ఇంట్లో ఒక వస్తువుని జాగ్రత్త చేస్తాం, కానీ అవసరం పడినపుడు ఎక్కడ పెట్టామో మర్చిపోయి వెతుక్కుంటూ ఉంటాం. చుసిన ప్రదేశాలు, తెలిసిన పేర్లు, చేసిన పనులు కూడా మర్చిపోతాం. ఈ మతిమరుపు మన మెదడు ఆక్టివ్ గా లేకపోవడం వలెనే జరుగుతుంది.
జీవితాలను సుఖవంతంగా, సౌకర్యవంతంగా మార్చుకోవడంలో తప్పు లేదు.. అయితే టెక్నాలజీకి  మాత్రం బానిస కాకుండా ఉండాలి. ఏ సమయంలో టెక్నాలజీ సాయం తీసుకోవాలి, ఏ సమయం లో తీసుకోకూడదు అని నిర్ణయించుకోవాలి. లేకపోతే మన జీవితాలపై మనమే నియంత్రణ కోల్పోయే ముప్పు ఉంది. మెదడు, శరీరంలో సమాచార మార్పిడికి కేంద్రబిందువుగా ఉంటుంది. ఆ మెదడుకి తగినంత పదును పెడుతూ ఉండాలి. ప్రతీ దానికి టెక్నాలజీ మీద ఆధారపడకూడదు. టెక్నాలజీ కి బానిస అయితే రాబోయే రోజుల్లో ఆలోచనాశక్తిని కోల్పోయి..రాను రాను మనిషి రోబోలా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
జీవితంలో కొంత ఒత్తిడి అవసరం. అత్యవసర పరిస్థితుల్లో తొందరగా ప్రతిస్పందించడం అలవాటవుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి జరిగి.. దాని వల్ల శక్తి లభించి… లక్ష్యంపై దృష్టి కేంద్రీకరిస్తారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తుల పై, వస్తువుల పై, ఓ కన్నేస్తూ ఉండాలి. కాంటాక్ట్ బుక్‌లోవెతుక్కునే పని లేకుండా  తెలిసిన 20 మంది ఫోన్ నంబర్లను గుర్తుంచుకొనేలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఉండే నగరం లేదా పట్టణంగురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోవాలి.
కొన్ని ప్రముఖ స్థలాలను గుర్తు పెట్టుకోవాలి. మనకు ఆప్తులు అనుకునే వారి పుట్టిన రోజులు, పెళ్లి రోజులను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు మన పూర్వికులు అందించిన సహజ సిద్ధమైన మేధాశక్తి ని తిరిగి వెనక్కు తెచ్చుకోవాలి. మెదడుకు మేత పెడితే అది ఉత్సహం గా పనిచేస్తుంది. అలా అని ఎక్కువగా ఆలోచించి ఆందోళన పడకూడదు. ఎక్కువ ఒత్తిడి, ఆందోళనలు మెదడుకు మంచివి కావు. ఎక్కువ ఒత్తిడి ఉంటే మెదడుకు విశ్రాంతిని ఇవ్వడం చాలా అవసరం. ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం కష్టమైతే మెడిటేషన్‌ లాంటివి చేయాలి. ఒత్తిడి కలిగించే హార్మోన్లు సాధారణ స్థాయికి చేరుకుంటాయి. మెదడు చురుకుగా పనిచేసి.. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
అలాగే మెదడు పనితీరు గ్లూకోజ్ లెవల్స్ పై కూడా ఆధారపడుతుంది. షుగర్ లెవల్స్‌ను సరిగా నియంత్రించకపోతే, మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో వంద ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పని చేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతుల్యంతో ఉండేలా చూసుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటే… సూక్ష్మజీవుల సమతుల్యతతో మెదడు బాగా పని చేస్తుంది. మెదడు కణాలు కొవ్వుతో తయారవుతాయి. తినే ఆహారపదార్థాలలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR