మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్ళినపుడు ఇలా చేయండి…

మనలో చాలమంది మన సాంప్రదాయాన్ని, ఆచారాలనూ భక్తిశ్రద్ధలతో అనుసరిస్తూ ఉంటాం. దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చేయడం మొదలైనవి చేస్తూ రిలిజియస్ పర్సన్ అనే నిర్వచనంలోకి వస్తాం. కానీ మన సాంప్రదాయాన్ని గూర్చి కొంతైనా తెలుసుకునే ప్రయత్నం అతి కొద్దిమందే చేస్తాం. ఇందుకు కారణం సమాజంలో వచ్చిన మార్పు, ఆధునిక జీవితంలో ఒత్తిళ్ళు, అంతకన్నా ముఖ్యంగా మన సంస్కృతి మూలాల్ని చెప్పేవాళ్ళు తక్కువగా ఉండడం.

tensionమన హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం ఓం అనే పదాన్ని పవిత్రతకు చిహ్నంగా భావిస్తాము.
సాక్షాత్తు ఓం అనే మంత్రాన్ని దైవ సమానంగా భావించి ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు.

చాలామంది పూజ అనంతరం ఈ మంత్రాన్ని చదవుతూ ఉంటారు. అయితే ఓం అనే మంత్రాన్ని ప్రతిరోజు చదవటంవల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

templesఓం అనే మంత్రాన్ని ప్రతిరోజూ ప‌ఠించ‌డం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు ఉత్తేజితం అవ్వడం వల్ల మన శరీరం ఎంతో చురుకుగా ఉండటమే కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మన శరీరంలో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి.

అదేవిధంగా మనలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతి రోజు చదవటం వల్ల మన శరీరంలో ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు.

om mantraనిటారుగా కూర్చుని ఈ మంత్రాన్ని పఠించండం చేత వెన్నెముక సమస్యలు కూడా తగ్గుతాయి. ఓం అనే నాదం మన శరీరంలోని అన్ని నాడుల కదలికకు దోహదపడుతుంది. ఈ క్రమంలోనే మనలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది.

back boneమానసిక వ్యాధితో బాధపడే వారు ప్రతి రోజు ఈ మంత్రాన్ని చదవటం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ మంత్రంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది కాబట్టి మనం ఏ దేవాలయాలకు వెళ్లినా ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఓం అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ ధ్యానం చేయటంతో మనసుకి ప్రశాంతత కలుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR