Home Health బరువు తగ్గాలని గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా? అది చాలా పొరపాటు!

బరువు తగ్గాలని గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా? అది చాలా పొరపాటు!

0

ప్రస్తుత రోజుల్లో గ్రీన్ టీకి బాగా ఆదరణ పెరిగింది. అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గ్రీన్‌ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.ముఖ్యంగా శ‌రీరంలోని కొవ్వును క‌రిగించేందుకు గ్రీన్ టీ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల రోజూ గ్రీన్ టీని తాగాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గ్రీన్‌ టీ మంచిదే కానీ దీన్ని అతిగా తాగరాదు. ఎక్కువగా గ్రీన్‌ టీని తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.

green teaగ్రీన్ టీ ఆరోగ్య‌క‌ర‌మైన లాభాల‌ను అందించిన‌ప్ప‌టికీ రోజుకు ఎన్ని క‌ప్పుల గ్రీన్ టీని తాగాలో చాలా మందికి తెలియదు. దీంతో కొంద‌రు మ‌రీ త‌క్కువ‌గా, కొంద‌రు మ‌రీ ఎక్కువ‌గా గ్రీన్ టీని తాగుతుంటారు. కానీ మోతాదులో తాగితేనే గ్రీన్ టీతో లాభాలు క‌లుగుతాయి. మ‌రి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే గ్రీన్ టీని రోజుకు ఎన్ని క‌ప్పుల మోతాదులో తెలుసుకోవాలి.

రోజుకు 3 క‌ప్పుల‌కు మించి గ్రీన్ టీని సేవిస్తే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక క‌ప్పు గ్రీన్ టీలో.. అంటే 240 ఎంఎల్ గ్రీన్ టీని తాగితే మ‌న‌కు దాదాపుగా 40 మిల్లీగ్రాముల వ‌ర‌కు కెఫీన్ ల‌భిస్తుంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం మ‌నం రోజుకు 300 మిల్లీగ్రాముల వ‌ర‌కు కెఫీన్‌ను తీసుకోవ‌చ్చు. అంత‌కు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అంటే.. 300 మిల్లీగ్రాముల మేర చూస్తే రోజుకు దాదాపుగా 7 క‌ప్పుల వ‌ర‌కు గ్రీన్ టీని తాగ‌వ‌చ్చు. కానీ కేవ‌లం గ్రీన్ టీని మాత్ర‌మే తాగితే ఈ సూత్రం వర్తిస్తుంది. కొంద‌రు కాఫీ, టీ ల‌తోపాటు గ్రీన్ టీని సేవిస్తారు. వాటిల్లోనూ కెఫీన్ ఉంటుంది. క‌నుక కాఫీ, టీలు తాగేవారు గ్రీన్ టీని తాగితే రోజుకు 3-4 క‌ప్పుల వ‌ర‌కు గ్రీన్ టీని తాగ‌వ‌చ్చు.

గ్రీన్ టీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం… గ్రీన్‌ టీలో కెఫీన్‌ అధికంగా ఉంటుంది. కాఫీ, టీ ల కన్నా అధిక మోతాదులో కెఫీన్‌ గ్రీన్‌ టీలో ఉంటుంది. కనుక రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువగా గ్రీన్‌ టీని తాగితే గుండె కొట్టుకోవడంలో తేడాలు వస్తాయి. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. ఇది గుండె సమస్యలను కలగజేసే అవకాశం ఉంది. గ్రీన్‌ టీలో కెఫీన్‌ ఎక్కువగా ఉంటుంది కనుక దాన్ని ఎక్కువగా తాగితే శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు పెరుగుతాయి. దీంతోపాటు కడుపునొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అతిగా గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. జీర్ణాశ‌యంలో అసౌక‌ర్యం క‌లుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ వ‌స్తాయి.

గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో అనీమియా (రక్తహీనత) వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే టానిన్స్ అనే సమ్మేళనాలు శరీరం ఐరన్‌ను గ్రహించకుండా చేస్తాయి. దీంతో ఐరన్‌ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య వస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఉండేవారు గ్రీన్‌ టీని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కానీ గ్రీన్‌ టీని ఎక్కువగా సేవిస్తే తలనొప్పి తగ్గకపోగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక దాన్ని మోతాదులోనే తీసుకోవాలి.

గ్రీన్ టీని బాగా తాగితే త‌ల‌తిర‌గ‌డం, వికారం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. లివ‌ర్ పై చెడు ప్ర‌భావం ప‌డుతుంది. గ్రీన్‌ టీని ఎక్కువగా తాగడం వల్ల నిద్ర లేమి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ టీని ఎక్కువగా తాగితే మన శరీరంలో కెఫీన్‌ ఎక్కువగా చేరుతుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. కనుక గ్రీన్‌ టీ మోతాదుకు మించితే నిద్ర సమస్యలు వస్తాయి. అందువల్ల దీన్ని తక్కువగా తాగాలి. గ్రీన్‌ టీని ఎక్కువగా తాగడం వల్ల అలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నాలుక, గొంతు, పెదవులు దురదగా అనిపిస్తాయి. క‌నుక గ్రీన్ టీని త‌గిన మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.

Exit mobile version