స్పైసీ ఫుడ్ లో టమాటా కెచప్ కలిపి తింటున్నారా…?

టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే టమాట ఆరోగ్యానికి మంచిది క‌దా అని దానికి బ‌దులుగా ట‌మాటా సాస్‌ను కావాల్సినంత లాగించేస్తుంటారు. ముఖ్యంగా బేక‌రీ ఆహారాల‌తోపాటు ఫాస్ట్ ఫుడ్‌పై కెచ‌ప్‌ను వేసి తింటారు. బ్రెడ్‌, ఫ్రైడ్‌ రైస్‌, నూడిల్స్, సమోసా, మంచూరియా ఇలా ర‌క‌ర‌కాల పుడ్స్‌తో క‌లిసి ట‌మాటా సాస్‌ను తీసుకుంటుంటారు. కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.

tomato sauceఅయితే కెచ‌ప్ ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లలే కాదు పెద్దలు కూడా లొట్టలేసుకుని మరీ దీనిని లాగిస్తుంటారు. అయితే రుచి తప్ప మరే పోషక పదార్థాలు లేని కెచప్‌ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు పోషక నిపుణులు.

tomato ketchupకేవలం తాజా టమాటాలతోనే కెచప్‌ను తయారుచేస్తారని చాలామంది అనుకుంటారు. అయితే వీటితో పాటు రుచి కోసం మోతాదుకు మించి చక్కెర, ఉప్పు, ఫ్రక్టోజ్ కార్న్‌ సిరప్‌లు కూడా ఇందులో కలుపుతారు. ఇవి పిల్లల్లో ఊబకాయం, పెద్దల్లో రక్తపోటు సమస్యలకు కారణమవుతాయి. కెచ‌ప్‌ను అధికంగా తింటే కొంద‌రికి అల‌ర్జీలు వ‌స్తాయి. కెచ‌ప్‌లో హిస్టామైన్ అధిక మొత్తంలో ఉంటుంది. అది అల‌ర్జీలను క‌ల‌గ‌జేస్తుంది. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు.

histamineట‌మాటా కెచ‌ప్‌ను అధికంగా తింటే బ‌రువు అధికంగా పెరిగి స్థూల‌కాయం స‌మ‌స్య వ‌స్తుంది. ఎందుకంటే కెచ‌ప్‌లో చక్కెర‌, ప్రిజ‌ర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. క్యాల‌రీలు కూడా ఎక్కువే. అందువ‌ల్ల కెచ‌ప్‌ను అధికంగా తింటే బ‌రువు పెరుగుతారు. అధికంగా ట‌మాటా కెచ‌ప్‌ను తిన‌డం వ‌ల్ల అసిడిటీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, జీర్ణాశ‌యంలో అసౌక‌ర్యం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయి. అందువ‌ల్ల కెచ‌ప్ వాడ‌కాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా కెచ‌ప్‌ను వాడ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

preservativesఇక కెచప్‌లను అధికంగా తీసుకుంటే శరీరంలో షుగర్‌, సోడియం స్థాయులు పెరుగుతాయి. దీని వల్ల బాడీలో ఖనిజాల అసమతుల్యత ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెచప్‌లను తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి పోషక పదార్థాలు లభించవు. కనీసం ఫైబర్‌, ప్రొటీన్‌ లాంటి పోషకాలు కూడా అందవు. కెచప్‌ లాంటి ప్రాసెస్డ్‌ చేసిన పదార్థాలను తినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తాయి.

mineral deficienciesసాధారణంగా 17 గ్రాముల కెచప్‌లో 19 క్యాలరీలు ఉంటాయి. ఈ క్రమంలో ఒక టేబుల్‌ స్పూన్‌ కెచప్ తీసుకుంటే పెద్దగా నష్టమేమీ లేదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ దీనిని నూనెలో వేయించిన, ప్రాసెస్డ్‌ చేసిన పదార్థాలతో తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల మూత్రం ద్వారా విసర్జితమయ్యే క్యాల్షియం లెవెల్స్ పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంది.

kidney stonesటమాటా కెచప్‌లలో హిస్టమైన్‌ అధికంగా ఉంటుంది. ఇది తుమ్ములు, దగ్గు వంటి అలర్జీలకు కారణమవుతుంది. కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఇతర కృత్రిమ పదార్థాలు కలపకుండా ఇంట్లోనే కెచప్‌ను తయారు చేసుకోవచ్చు. కానీ రుచి కంటే ఆరోగ్యం ముఖ్యమని తెలుసుకుని స్పైసీ, ఫ్రైడ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR