తినేటప్పుడు టీవీ చూస్తున్నారా? అయితే బరువు పెరగడం గ్యారెంటి !

కొంత మంది టీవీ లేనిదే భోజనం చేయలేరు. కొంతమంది టీవీ చూస్తూ కాలక్షేపానికి స్నాక్స్ తింటుంటారు. లేదా జంక్ ఫుడ్ అంటూ, కూల్ డ్రింకులంటూ ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తుంటారు. అయితే టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత తింటున్నామో తెలియదు. అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది.

Do you gain weight by watching TV and eatingఒకే చోట గంటలు తరబడి కూర్చోవడం, ఎక్కువగా తింటుండటంతో జీర్ణ సమస్యతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది టీవీ చూస్తూ మరిచిపోయి ఎక్కువ తినేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ చిట్కాలు.

Do you gain weight by watching TV and eatingఆకలేసినప్పుడు టీవీ ముందుకు వచ్చి భోజనం తెచ్చుకోవడం కాకుండా.. మీరే భోజనం వద్దకు వెళ్లండి. డైనింగ్ టైబుల్ పై కూర్చోని ప్రశాంతంగా తినండి. తినే ఆహారాన్ని ఆస్వాదించండి. లేదు టీవీ హాల్ లోనే తినాలనుకుంటే టీవీని ఆఫ్ చేసి భోజనం చేయండి. తినే పది, ఇరవై నిమిషాలు టీవీని ఆఫ్ చేసి తినండి. ఇలా అలవాటును మార్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.

Do you gain weight by watching TV and eatingఏ పని చేసినా దానిమీదే దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ పనిపై అవగాహన వస్తుంది. ఆహారం తినడం కూడా పని లాంటిదే. అవగాహన లేకుండా తింటూ కూర్చుంటే బరువు పెరిగే ఆస్కారం ఎక్కువ. అందుకే తినేటప్పుడు పొదుపుగా తినాలి. కడుపు నిండితే మెదడే ఇక తినడం ఆపండంటూ సంకేతాలు ఇస్తుంది.

Do you gain weight by watching TV and eatingకానీ, కొందరు అదేమీ పట్టించుకోకుండానే టీవీలు చూస్తూ తినేస్తుంటారు. టీవీ చూస్తూ తింటున్నంత సేపు ఎంత తింటున్నామో.. ఏం తింటున్నామో విషయాన్ని మెదడు గుర్తించదు. దీంతో ఎక్కువ మోతాదులో ఆహారాన్ని కడుపులో వేసేస్తుంటాం.

Do you gain weight by watching TV and eatingకూర్చోని టీవీ చూస్తూంటే తినాలనే ఆలోచన పుట్టుకొస్తుంది. కానీ నీళ్లు తాగాలని అనిపించదు. అందుకే తినాలని అనిపించిన ప్రతిసారి గుక్కెడు నీళ్లు తాగండి. దీనివల్ల శరీరంలో నీటి శాతం కూడా సమానంగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR