తిన్న వెంటనే త్రేన్పులు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా?

తినేటప్పుడు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఉండడం గమనించే ఉంటాం. తినడం అయిపోగానే బేవ్‌వ్.. అంటూ తేన్పడం వల్ల ఎదుటివాళ్లు ఏమీ అనలేక ఒక చూపు చూస్తారు. ఆ చూపు చాలు అక్కడి నుంచి లేచి వెళ్లిపోవడానికి. అసలు త్రేన్పు అనేది భోజన ప్రియులకు మాత్రమే రాదు, అందరికీ వస్తుంది. …కాకపోతే కాస్త ఎక్కువ తిన్న వాళ్ళకు ”బ్రేవ్‌” మనే శబ్దం ఎక్కువగా రావొచ్చు. ఆహారం తీసుకున్న తరువాత ప్రతి వారూ త్రేన్చుతారు… ఒక్కోసారి అజీర్తి చేస్తుందనుకోండి. అప్పుడు కడుపులో నుండి అదే పనిగా పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయి. ఇంగ్లీషులో బర్పింగ్ అంటాము.

burpsఅసలు ఏ తేన్పులు ఎందుకు వస్తాయి. త్రేన్పు అనేది లోపల ఉత్పత్తి అయిన గాలి, ఆహార నాళం కలసి చేసే ఒక గమ్మత్తు. మనం ఆహారం తీసుకుంటున్న సమయంలో నోరు తెరుస్తాం. అలా తెరచినప్పుడు బయటి గాలి నోటి ద్వారా కడుపులోకి చేరుకుంటుంది. మన లోపల ఛాతీకి, ఉదరానికి మధ్య తలుపు లాంటిది ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం లోపలికి వచ్చిన వెంటనే తలుపు మూసుకుంటుంది. ఇలా మూసుకోవటం వల్ల కడుపులోని జీర్ణరసాలు పైకిరావు. ఇలా ఉదరంలో కొంత గాలి కూడా చేరుకుంటుందన్న మాట….అంతేకాక, మనం తిన్న ఆహారం జీర్ణమవుతున్నపుడు మరికొంత వాయువు ఉత్పత్తి అవుతుంది.

burpsవెంటనే కడుపులో ఉన్న కండరాలు బిగుస్తాయి. దానితో తలుపు తెరచుకుంటుంది. కడుపులో ఏర్పడిన వాయువు బయటకు బయలుదేరుతుంది. అలా ఆహారనాళం నుండి బయటకు వస్తూ కొన్ని ప్రకంపనలను కలిగిస్తుంది. దానితో ధ్వని వెలువడుతుంది….ఆ ధ్వనినే ”త్రేన్పు” అంటున్నాం. చాలామందికి ఆహారం తీసుకున్న వెంటనే తేన్పులు వస్తుంటాయి. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలా చేస్తే ఆహారం తీసుకుంటున్నప్పుడు అధికంగా గాలిని మింగడం, తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, ఎసిడిటి, హియాటస్ హెర్మా వంటివాటితో కడుపులో వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఈ సమస్య ఎక్కువైతే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

digestive systemఇంకా ఆహారం తీసుకునేటప్పుడు నిదానంగా నమిలి తింటే పొట్టలో గాలి చేరకుండా చూసుకోవచ్చు. పాలు, చిక్కుడు జాతికూరలు, క్యాబేజీ, ఉల్లిగడ్డతోపాటు వేపుళ్లను తగ్గించుకోవాలి. అప్పుడే వాయువులు తగ్గుతాయి. అల్లం, శొంఠి, ఇంగువ, వాము, పుదీనా, సోంపు, జీలకర్రను ఎక్కువగా వాడుతుంటే తేన్పులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఒకసారి తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేవరకు మళ్లీ తీసుకోకూడదు. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలి.

fennel seedsత్రేన్పులు రాకుండా ఉండటానికి భోజనం తిన్న వెంటనే అరచెంచా సోంపు నోట్లో వేసుకుని నెమ్మదిగా నములుతూ ఉంటే సమస్య తగ్గుతుంది. వారం లో మూడు నాలుగు సార్లు పుదీనా పచ్చడిని ఆహారంలో తింటూంటే తేన్పులు రావటం తగ్గుతుంది. వాము వేయించి పొడి చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే చెంచా వాముపొడి, అరచెంచా కరిగించిన నెయ్యి వేసుకుని తినటం మంచిది. రెండు లేదా మూడు లేత తమలపాకుల్లో కొద్దిగా వక్క, సున్నం, ఒక లవంగం వేసుకుని. అన్నం తిన్న తరువాత ఈ తాంబూలం నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నములుతూంటే సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

panరోజూ ఓ గ్లాస్ పాలను క్రమం తప్పకుండా తాగితే గ్యాస్ ట్రబుల్ సమస్య రాదట. వేడివేడి పాలు కాకుండా చల్లటి పాలు తాగితే మరింత మంచిదట. దీని వల్ల కడుపు మంట, పుల్లటి తేన్పులు, వికారం, గుండె మంట వంటివి తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉత్పత్తయ్యే యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుందట. పెరుగుకు కూడా యాసిడ్‌ను కంట్రోల్ చేసే గుణం ఉంది. పెరుగు సహజమైన ప్రొబయోటిక్‌గా పడిచేస్తూ జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.

burps

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR