తాటిబెల్లంలో ఉండే అద్భుతమైన పోషక విలువలు గురించి తెలుసా ?

తాటి బెల్లం అనేది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.

4 Mana Aarogyam 164కానీ తాటి బెల్లం సహజసిద్ధమైన తీపి బెల్లం. దీన్ని తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. అందుకే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉంటాయి.

తాటిబెల్లంఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ఆహారాన్ని జీర్ణం చేయటానికి ఆహారాన్ని తీసుకున్న తరువాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తోంది మరియు పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

మలబద్ధకంఐరన్‌ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది. యాంటాక్సిడెంట్ల కారణంగా శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ కూడా ఉంటుంది.

ఐరన్‌దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్‌ తొలగించడంలోనూ సాయపడుతుంది. మైగ్రేన్‌, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

dhagguతాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR