గంగా నదికి ఉన్న అద్భుత శక్తి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

మనదేశంలోని జీవనదుల్లో ముఖ్యమైనది గంగా నది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. భారతీయులకు గంగానదితో అనుబంధం పెనువేసుకుపోయింది. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల మత విశ్వాసాలకు, స్వచ్ఛతకు గంగానది ప్రధాన సూచిక. వేద కాలం నుంచి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని వినియోగిస్తున్నారు. జనన మరణాల సమయంలో గంగాజలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు.

గంగా నదిగంగా జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అతంటి పరమ పావనమైన గంగాజలం గురించి ప్రపంచానికి తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. వేదాల్లో ఒకటైన రుగ్వేదంలోని 10.75 భాగం నదీస్తుతిలో తూర్పు నుంచి పశ్చిమానికి ఉన్న నదుల పేర్లు పేర్కొన్నారు. వాటిలో గంగానది పేరు కూడా ఉంది. రుగ్వేదం 3.58.56 సంహితలో ఇలా చెప్పారు. వీరులారా మీ వంశగృహం, పవిత్ర స్నేహం, సంపద అన్నీ జాహ్నవి ఒడ్డున ఉన్నాయి. పురాతన ఆర్య యుగంలో సరస్వతి, సింధు నదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అయితే వేదాల కాలం నుంచి గంగానది ప్రాధాన్యత పెరిగింది.

గంగా నదిగంగా జలాన్ని సేవించడం వల్ల పాపాలు చేసిన వారికి కూడా మోక్షం కలుగుతుంది. మరణం ఆసన్నమైనప్పుడు గంగాజలాన్ని తులసితో కలిసి తీసుకుంటే స్వర్గ ప్రాప్తి. అందుకే పూర్వీకుల నుంచి గంగాజలాన్ని అమృతంగా భావిస్తూ సేవిస్తారు. నిరాకారియైన గంగ బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది. ఒకసారి శంకరుడు ఆలపించిన రాగానికి నారాయణుడు పరవశించిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి పాదాల నుంచి ద్రవీభవించిన జలాన్ని బ్రహ్మదేవుడు తన కమండలానికి తాకించగా నిరాకార గంగ జలంగా మారింది.

గంగా నదిశ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రివిక్రముడై మూల్లోలోకాలను కొలిచినపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని ఆ నీటితోనే విష్ణుపాదాలను కడిగాడు. ఆ పాదము నుంచి ప్రవహించినదే దివ్యగంగ. గంగానది 2510 కిలోమీటర్ల సుధీర్ఘ ప్రవాహంలో ఎన్నో మూలికలను గ్రహిస్తుంది. దేవతలు సైతం గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గంగానదిలో స్నానమాచరించడం వల్ల చేసిన పాపాలకు విముక్తి కలిగి కొత్త జీవితం ఆరంభమవుతుందనే నమ్మకం. మరణానంతరం అస్తికలను గంగానదిలో కలపడం ద్వారా ఆత్మకు శాంతి కలుగుతుందని పెద్దల ప్రగాఢ విశ్వాసం.

గంగా నదిగంగానదిలో మునక వల్ల అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు పితృదేవతలు తరిస్తారట. అంతటి పవిత్రమైన గంగానది ఇపుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. కొన్ని లక్షల టన్నుల చెత్త కలిసినా కూడా గంగలో పవిత్రత ఎలా ఉంది, కలుషితం కాకుండా ఎలా ఉండగలుగుతుందో అని చంఢీగర్ కు చెందిన మైక్రోబయాలజిస్టులు గంగా నది పవిత్రతపై పరిశోధనలు జరుపుతున్నారు.

గంగా నదివీరు జరుపుతున్న పరిశోదనలో గంగా నది నీళ్లలో రకరకాల బ్యాక్టీరియాలను నిర్ములించే బ్యాకిట్రయోఫేజ్ కు చెందిన పలు వైరసులు పుష్కలంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ వైరసులు హానికరమైన బ్యాక్టీరియాలను హరించడం ద్వారా గంగా నది నీళ్లు మురిగిపోకుండా అలాగే చెడిపోకుండా ఉంచుతున్నట్లు గుర్తించారు. గంగా నదిలో ఉన్న ఈ వైరస్ అత్యంత శక్తివంతమైన యాంటీ బయాటిక్ మందులకు లొంగని ఇన్ఫెక్షన్లను సైతం అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే ఈ వైరస్ లలో 20-25 వరకు అత్యంత శక్తి కారాకాలను పలు వ్యాధులకు విరుగుడుగా ఉపయోగించవచ్చు అని తెలిపారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR