ఆడవాళ్లు అందం పెంచుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉపయోగిస్తుంటారు. కొంతమంది ఖరీదయినా క్రీములు వాడుతారు. మరి కొంతమంది ఇంట్లో దొరికే పధార్ధాలను ఉపయోగించి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే మార్కెట్ లో దొరికే ఖరీదయినా క్రీములు వాడే కంటే ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించడం ఉత్తమం. ఎందుకంటే బయట దొరికే ప్రొడక్ట్స్ లో రసాయన పదార్ధాలు ఉంటాయి. అవి చర్మానికి హాని కలిగిస్తాయి.
మరి మన వంటింట్లో దొరికే వాటిని ఏ సమస్యకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం…
పగిలిన మడమలు, పాదాలకు వారం రోజుల పాటు రోజూ మగ్గిన అరటి పండు గుజ్జును పాదాలకు మర్దన చేసి అరగంట తర్వాత నీటితో కడిగితే సమస్య నయమవుతుంది.
చెంచా త్రిఫల చూర్ణం, అరచెంచా పసుపు, తగినన్ని నీళ్ళు కలిపి ముద్ద చేసి, రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని, పాదాలకు బాగా రాయాలి. ఉదయం లేచాక కడుక్కుంటే పగుళ్ళు తగ్గుతాయి. ఇలా వారం రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
చెమట, కాలుష్యం, పేలుకారణంగా ఇన్ఫెక్షన్ ఏర్పడి తల మీద కురుపులు, పుండ్లు పడితే చెంచా వేపనూనె, 10 గ్రాముల కర్పూరం కలిపి మాడుకు పట్టిస్తే పేలు నశించటమే గాక పుండ్లు, కురుపులు పూర్తిగా మాడిపోతాయి.
చెంచా కస్తూరి పసుపు ముద్దకు, అరచెంచా నువ్వుల నూనె కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
మూడు పూటలా బటాణీ గింజ సైజు వేపాకు ముద్ద మింగితే ఎన్ని క్రీములు వాడినా వదలని మొటిమలు సైతం వదిలిపోతాయి.
చెంచా చొప్పున నిమ్మ రసం, పాలుకలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమల మచ్చలు పోతాయి.
గజ్జి బాధితులు గుప్పెడు వేపాకు, చెంచా పసుపు, చెంచా ఉప్పు దంచి ముద్దజేసి గజ్జి కురుపుల మీద రుద్ది గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు మానిపోతాయి.