అలసటని, బద్ధకాన్ని దూరం చేసే మార్గాలు ఏంటో తెలుసా ?

ఏ పని చేయాలనుకున్నా మనలో ఉండే బద్దకం మనల్ని గెలవనీయకుండా ముందుకు వెళ్ళనీకుండా చేస్తుంది. చిన్న చిన్న పనులకే అలసిపోవడం, అంతకుమించి చేయడానికి ఇష్టపడకపోవడం లాంటివన్నీ జీవితాన్ని ముందుకు వెళ్లనివ్వవు. పెద్దలు కూడా జీవితంలో గెలవాలంటే ముందు బద్దకాన్ని వదిలేయాలని చెబుతారు.

reduce fatigue and lazinessభవిష్యత్తుని చిదిమేసే అలసటని, బద్ధకాన్ని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు చూపిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

reduce fatigue and lazinessపొద్దున్న లేవగానే కాఫీ తాగవద్దు. కాఫీలో ఉన్న కెఫైన్ వెంటనే ఎనర్జీ వచ్చేలా చేస్తుంది. కానీ ఆ ఎనర్జీ టెంపరరీ మాత్రమే. అంతే గాక ప్రతీసారీ తాగాలనిపించేలా చేస్తుంది. జీవక్రియ సరిగ్గా పనిచేయాలంటే కాఫీకి దూరంగా ఉండాలి. ఉదయం లేవగానే రెండు ఖర్జూర పండ్లు, 3లేదా 4 నల్లటి ఎండు ద్రాక్ష తీసుకోండి. వీటిలో ఉన్న ఐరన్, శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ ని పెంచుతుంది.

reduce fatigue and lazinessరెండు లవంగాలు, యాలకులు, లేదా సోపు గింజలు తీసుకుని వాటికి బెల్లం కలుపుకుని తినడం మంచిది. దీనివల్ల నిద్రమత్తు ఫీలింగ్ దూరమై బద్దకం మననుండి దూరంగా పారిపోతుంది. అంతే కాదు రక్తంలోని చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది.

reduce fatigue and lazinessకావాల్సినన్ని నీళ్ళు.. శరీరానికి కావాల్సినన్ని నీళ్లు ఖచ్చితంగా తాగాలి. రోజులో కనీసం ఆరు గ్లాసుల నీరైనా తాగాలి. లేదంటే శరీరం తొందరగా అలసటకి గురవుతుంది.

reduce fatigue and lazinessరాత్రి పూట ఫోన్ ని తీసి పక్కన పెట్టేయండి. ఫ్యామిలీతో గడపండి. కుటుంబంతో గడుపితే కొత్త ఎనర్జీ వస్తుంది. ఫోన్ వాడడం వల్ల అందులోని నీలికాంతి కళ్ళపై పడటం వల్ల తొందరగా అలసిపోతారు.

reduce fatigue and laziness

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR