సీత రాములు అరణ్యవాసంలో ప్రయాణించిన దూరం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పిన తల్లి కోరిక మేరకు తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి రాజ్యాన్ని, కిరీటాన్ని వదిలిపెట్టి సీత, తమ్ముడు లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్ల వనవాసానికి బయల్దేరాడు రాముడు. ఉత్తరభారతదేశం నుంచి దక్షిణభారతదేశమంతా వీరు ప్రయాణించారని వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తుంది. అయోధ్య నుంచి మొదలైన సీతారామ లక్ష్మణుల ప్రయాణం నేటి ఉత్తరప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని జనక్‌పూర్, మహారాష్ట్ర, కర్నాటక, హంపి, తమిళనాడుల మీదుగా సాగింది.

sita Ramaగోదావరి తీరాన పంచవటిలో సీతను రావణుడు అపహరించాడని, అటునుంచి రాముడు సీతను వెదుకుతూ రామేశ్వరం చేరుకున్నాడని, హనుమంతుడు, వానరుల సాయంతో సముద్రం మీద వారధి నిర్మించి, లంకను చేరి రావణుడిని హతమార్చి, సీతను తీసుకొని తిరిగి అయోధ్య చేరుకున్నాడని కథనం.

sita Ramaకాలినడకన అరణ్యాలు, కొండకోనలు దాటుకుంటూ నదీపరీవాహక ప్రాంతాలను సమీక్షిస్తూ… వేల యోజనాలు సీతారామ లక్ష్మణులు ప్రయాణించి ఉండవచ్చని, ఇంత అని నిర్ధారణ చేయలేని ప్రయాణం వీరిదని చరిత్రకారులు చెబుతున్నారు. రామలక్ష్మణులకు విశ్వామిత్రుని యాగసంరక్షణార్థం బాల్యంలోనే అడవులకు వెళ్లి, రాక్షసులతో పోరాడిన అనుభవం ఉంది. కాని, సీత.. జనకుని ఇంట సుకుమారిగా పెరిగిన యువరాణి. పట్టు తివాచీల రహదారులే ఆమెకు తెలిసింది. అలాంటిది అత్తింట్లో అడుగుపెట్టడంతోనే ఆమె భర్త వెంట వనవాసం చేయడానికి ప్రయాణమైంది.

sita Ramaరాముడితో పాటు దుర్భేధ్యమైన అడవి మార్గాల గుండా తనూ కాలినడకన ప్రయాణించింది. అడుగడుగునా ముళ్లూ, రాళ్లూ, క్రూరమృగాలు, విష సర్పాలు, రాక్షసులు.. ఎండావానలు.. వేటినీ లెక్కచేయక వేల యోజనాలు, అంటే 2,322 కి.మీ.పాదయాత్ర చేసి భర్త వనవాస దీక్ష దిగ్విజయం కావడానికి తనూ పాటుపడింది. బహుశా ఆమె పడ్డ కష్టానికేనేమో అటు పుట్టింటి వంశానికి ఇటు మెట్టినింటికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR