Home Unknown facts రాక్షస రాజు పూజించిన ఆ అమ్మవారు ఎవరు ? ఆలయం ఎక్కడ ఉంది

రాక్షస రాజు పూజించిన ఆ అమ్మవారు ఎవరు ? ఆలయం ఎక్కడ ఉంది

0

మన పురాణాల ప్రకారం ఒక శాపం కారణంగా మూడు జన్మలు రాక్షసుడిగా జన్మించిన ఒక రాక్షసుడు ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని కులదేవతగా భావించి పూజలు చేసాడని పురాణం. మరి ఆ రాక్షసుడు ఎవరు? ఆ అమ్మవారు ఎవరు? ఆ అమ్మవారు వెలసిన ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mantralayamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, తుంగభద్ర నది ఒడ్డున మంత్రాలయం అనే ఆలయం ఉంది. అయితే ఈ ఆలయం రావేంద్రస్వామి గుడి ఎదురుగా శ్రీ మంచాలమ్మ తల్లి ఆలయం ఉంది. ప్రధాన ఆలయానికి వెళ్లేముందు గ్రామదేవత అయినా మంచాలమ్మ తల్లిని ముందుగా దర్శించడం ఆచారం.

ఇక పురాణాకి వస్తే, పరశురాముడు తాను శిక్షించేది కన్నతల్లి అని తెలిసి కూడా తండ్రి పరిపాలన కోసం తల్లిని సంహరించాడు. పరశురాముని తల్లి అయినా రేణుకాదేవియే తుంగభద్ర నది తీరాన మంచాలమ్మగా వెలసినది చెబుతారు. అందుకే ఈ గ్రామాన్ని మంచాల గ్రామం అని పిలిచేవారని చెబుతారు.

ఇది ఇలా ఉంటె హిరణ్యకశ్యపుని రాజ్య సంస్థానంలో ఈ గ్రామం ఉండేది. ఈ తల్లిని అతడు కులదేవతగా పూజించేవాడు. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు కూడా మంచాలమ్మను ఆరాదించేవాడని పురాణం.

ఇంకా ద్వారయుగంలో పాండవులు అశ్వమేధయాగం చేసినప్పుడు జైత్రయాత్ర వేళ అర్జునుడు, అనుసలుడుల మధ్య ఈ ప్రదేశంలో ఘోర యుద్ధం జరుగగా, యుద్ధం ప్రారంభించిన చోటు నుండి అనుసలుని రథసారధి శ్రీకృష్ణుడు తన రధాన్ని వెనుకకు మరలించాడు. దాంతో అనుసాలుని రథం కూడా ముందుకు కదలక తప్పలేదు. అప్పుడు వెంటనే అర్జునుడు అనుసాలుని ఓడించాడు.

ఈవిధంగా ఈ గ్రామదేవత మంచాలమ్మ ప్రదేశంలో ఉన్నవారికి అపజయం కలుగదని ఎప్పుడు విజయమే కలుగుతుందని నమ్మకం.

Exit mobile version