అనస్థీషియా శరీరంపై ఎలా పని చేస్తుందో తెలుసా?

ఆపరేషన్ చేసే ముందు పేషేంట్లకు కచ్చితంగా అనాస్థిషియా(మత్తు మందు) ఇస్తారనేది తెలిసిన విషయమే. చిన్న చిన్న సర్జరీల నుండి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అనాస్థిషియాను ఇచ్చే నిర్వహిస్తారు. మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత మరో మూడు నాలుగు గంటల పాటు దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాతే అతడు స్పృహలోకి వస్తాడు.

Anesthesiaఅయితే అనాస్థిషియా ఎలా పనిచేస్తుంది. చిన్న మందుతో అంత పెద్ద మనిషికి ఎలా నొప్పి లేకుండా చేస్తారు అనేది మన అందరికీ సందేహం వస్తుంది. అయితే అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం… అనస్థీషియా అనేది శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వ్యక్తికి బాధను లేకుండా చేసే ఒక వైద్య ప్రక్రియగా చెప్పవచ్చు.

Anesthesiaఅనస్థీషియా ఔషధాలగా పిలువబడే విస్తృత శ్రేణి మందులను ఉపయోగించి అనస్థీషియా ఇవ్వబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే అనస్థీషియా మందులు మూడు రకాలుగా ఉంటాయి. స్థానిక, ప్రాంతీయ, మరియు సాధారణ అనస్థీషియా. స్థానిక మరియు ప్రాంతీయ మత్తుమందులు శరీరం యొక్క ప్రత్యేక భాగానికి తిమ్మిరి ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

Anesthesiaఅయితే ఈ ప్రక్రియలో ఆ వ్యక్తి మేలుకొనే ఉంటాడు. సాధారణ అనస్థీషియా ప్రక్రియలో వ్యక్తి నిద్రిస్తాడు. అనాస్థిషియా అనేది ఒక రకమైన మందు. దీంతో గాఢనిద్ర వచ్చేలా చేయవచ్చు. సాధారణ అనస్థీషియా ఒక వ్యక్తికి ఎక్కించినప్పుడు, మెదడు మరియు శరీరంలోని నాడి సిగ్నల్స్ కి అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలో, వ్యక్తికి ఏమి జరుగుతుందో పూర్తిగా తెలియదు.

Anesthesiaఇది నొప్పిని తెలియజేయడానికి మెదడుని అనుమతించదు. అందువలన శరీరంలోని భాగం తిమ్మిరితో ముడిపడిన స్థితిలో కొనసాగుతుంది. మెదడులో ఒక ప్రత్యేక రకమైన కణాలు ఉంటాయి. ఇవి మనిషిని మేలుకొల్పి ఉంటాయి. వీటిని ‘‘రెక్టిక్యులర్ ఫార్మేషన్”అంటారు. ఇది నరంలోని కణజాలం, మెదడులోని ఇతర భాగాలకు చేరవేస్తుంది.ఈ కణాలకు మధ్య గల సంబంధమే మనల్ని మెలుకువతో ఉంచేది. Na+మరియు K+ అయాన్లు మార్పిడి కణాల తలం దగ్గర జరిగినప్పుడు చిన్నగా ఎలక్ట్రికల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని మెదడులోని కణాల రసాయనాల ద్వారా తెలుపుకుంటాం. అనాస్థిషియా తాత్కాలికంగా రసాయనాల, ఎలక్ట్రిక్ సంకేతాల మధ్య చర్యల జరుగకుండా చేస్తుంది.

Anesthesiaఈ చర్య వల్ల మెదడుకు సంకేతాలు చేరవు. దీనివల్ల మనిషికి అపస్మారకం ఏర్పడుతుంది. హృదయ స్పందన రీతి, రక్తపోటు మరియు ఒత్తిడి హార్మోన్ విడుదల వంటి శారీరక ప్రక్రియలను స్థిరంగా నిర్వహించడానికి కూడా అనస్థీషియా సహాయపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR