అర్జునుడు శివుని దగ్గర నుండి పాశుపతాస్త్రం ఎలా పొందాడో తెలుసా

జూదంలో ఓడిపోయి సర్వం పోగొట్టుకున్న పాండవులు వనవాసానికి బయలుదేరారు. ఆ తరువాత కౌరవులను ఓడించడానికి కృష్ణుడి ఆజ్ఞ మేరకు భీముడు ఆంజనేయుడి దగ్గర విద్యలు నేర్చుకోవడానికి వెళతాడు. నకుల సహదేవులు అశ్వినీ పుత్రుల దగ్గరికి వెళ్లగా, అర్జునుడు శివుడి దగ్గర నుండి అత్యంత మహత్వపూర్ణవైన పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సుకు పూనుకున్నాడు. కొన్నాళ్ళకు అర్జునుడి ఘోర తపస్సు కారణంగా అక్కడ అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో అదే కొండపై తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నారు. దీంతో మీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు శివుడు. ఆ సమయంలో మునుల మాటలు విన్న పార్వతి, శివుడితో ఆయధ శక్తి కోసం అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నువ్వు అర్జునుడికి ఆ శక్తిని ప్రసాదిస్తే అతడు ఆ శక్తిని దేని కోసం ఉపయోగిస్తాడోనని సందేహం వ్యక్తంచేసింది.

Pasupatastraపార్వతి ప్రశ్నకు తన చూపుతోనే సమాధానం ఇచ్చిన శివుడు అర్జునుడి వైఖరిని పరీక్షించడానికి పార్వతితో కలిసి మారువేషంలో బయల్దేరుతారు. శివుడు కోయ దొరలాగా, పార్వతి అదే కొండ జాతికి చెందిన స్త్రీ రూపంలో బయల్దేరారు. వారితో పాటు కైలాసంలోని తమ సేవకులను కొండ జాతికే చెందిన స్త్రీలుగా మార్చి వారిని తమ వెంట తీసుకుని వెళ్తారు. ఆదిదంపతులు అర్జునుడిని చేరుకునే సమయానికి వారికి ఓ అడవి పంది కనిపించింది. అది మామూలు పంది కాదు పంది రూపంలో ఉన్న రాక్షసుడు. మునీశ్వరుల తపస్సును భగ్నం చేయడానికే ఇలా పంది రూపంలో వచ్చాడని శివపార్వతులు గమనిస్తారు. వెంటనే తన బాణాన్ని ఎత్తి పందికి గురిచూసి కొట్టబోగా మహాదేవుని గమనించిన అసురుడు అక్కడి నుంచి తప్పించుకొని అర్జునుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి పరుగెత్తుతాడు. అడవి పంది రాక చూసిన మునీశ్వరులు ప్రాణాలు దక్కించుకోవడం కోసం అక్కడి నుంచి పరిగెత్తగా.. అర్జునుడు మాత్రం తన విల్లును ఎత్తి అడవి పంది వైపు గురిపెడతాడు.

Pasupatastraకోయ దొర రూపంలో ఉన్న శివుడు ఆ అడవి పంది తన వేట అని, దాన్ని వదిలేయమని అర్జునుడిని వారిస్తాడు. కానీ శివుడిని గుర్తించని అర్జునుడు కోయ దొర మాటలను ధిక్కరిస్తాడు. ఒకసారి ఎత్తిన విల్లు లక్ష్యం చేరుకునే వరకు దించడం అనేది ఉండదని వాదిస్తాడు. అలా ఒకరితో ఒకరు సవాలు వేసుకొని ఎవరి విల్లు లక్ష్యాన్ని చేరుకుంటుందో చూద్దాం అని ఆ అడవి పంది రూపంలో ఉన్న అసురుడిపైకి ఇద్దరూ బాణాలు సంధిస్తారు. ఇద్దరి బాణాలకు ఆ అడవి పంది ప్రాణాలు వదులుతుంది.

Pasupatastra అయితే అక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. ఆ అడవి పంది చనిపోయింది తన బాణం వల్లే అంటే తన బాణం వల్లే అని మళ్ళీ ఇద్దరు వాగ్వాదానికి దిగుతారు. దీంతో మరోసారి అర్జునుడు, శివుడి రూపంలో ఉన్న కోయ దొరకు సవాలు విసురుతాడు. ఈసారి ఇద్దరం పోటీపడదామని.. ఎవరు గెలిస్తే వారి వల్లే ఆ అడవి పంది చనిపోయినట్టు భావించాల్సి ఉంటుందని అర్జునుడు చెబుతాడు. దానికి పరమశివుడు కూడా అంగీకరిస్తాడు.

Pasupatastraఅలా శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్న అర్జునుడు తనకు తెలియకుండానే శివుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగిన కొద్దిసేపటి తర్వాత అర్జునుడి వద్ద ఆయుధాలు అయిపోతాయి. అది చూసిన ఆ కోయ దొరే అర్జునుడికి ఆయుధాలు అందిస్తాడు. అయితే కోయ దొర ఇచ్చిన ఆయుధాలను తీసుకోవడానికి ఇష్టపడని అర్జునుడు తన ఖడ్గంతో యుద్ధానికి దిగుతాడు. కానీ అది కూడా ఆ కోయ దొర శరీరాన్ని తాకడంతోనే పూలుగా మారిపోతుంది. ఆ వింతను గమనించిన అర్జునుడు తనతో తలపడింది సాక్షాత్తు ఆ పరమశివుడే అని గుర్తించి ఆ భూతనాథుణ్ణి ప్రార్థిస్తాడు. తనకు తెలియకుండానే తాను ఆ మహా శివుడితో యుద్ధానికి దిగానని గ్రహించి సిగ్గుపడుతాడు. శివుడి ముందు మొకరిల్లి జరిగిన తప్పిదానికి తనను క్షమించాల్సిందిగా వేడుకుంటాడు.

Pasupatastraఅర్జునుడి భక్తికి, పరాక్రమానికి మెచ్చిన శివుడు… అప్పుడు అసలు రూపంలో దర్శనమిచ్చి పాశుపతాస్త్రాన్ని వరంగా అందిస్తాడు. ధర్మం వైపు నిలబడిన నీకు ఈ ఆయుధం యుద్ధంలో తోడుగా ఉంటుంది. మహాశక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతారు. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో కర్ణుడిపై అదే పాశుపతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయం సాధిస్తాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR