అరటి పండు తొక్క మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా ?

అందరికీ అందుబాటు ధరలో అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసే వారు అథ్లెట్స్ రోజువారీ డైట్ లో అరటి పండును భాగం చేసుకుంటారు. అయితే చాలా మంది అరటిపండ్లను తిని వాటి తొక్కలను పారేస్తుంటారు. నిజానికి అరటి పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటి వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో, వాటి తొక్క వల్ల కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి.

banana peelమరి అరటి పండు తొక్క ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు తొక్కలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అలాగే ఐరన్, మెగ్నిషియం, పొటాషియం తదితర పోషకాలు కూడా అరటి పండు తొక్కలో ఉంటాయి. దీంతోపాటు మూడ్‌ను మార్చి డిప్రెషన్‌ను తగ్గించే సెరొటోనిన్ అనబడే సమ్మేళనం కూడా అరటి పండు తొక్కలో ఉంటుంది. అందుకనే ఆ తొక్కను తినమని వైద్యులు సలహా ఇస్తున్నారు.

3 Mana Aarogyam 144అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది.

వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు తగ్గుతాయి. అరటి తొక్కలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కంటిని కాపాడుతుంది.

Night Sleepకాలినగాయాలు, పుండ్లు, దెబ్బలపై అరటి పండు తొక్కతో మర్దనా చేస్తే ఆ గాయాలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

కాలినగాయాలుఅరటిపండు తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఆ తొక్కలను ముఖానికి మర్దనా చేసినట్లు రాస్తే మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖ సౌందర్యం పెరుగుతుంది.

Pimplesపులిపిర్లపై అరటి తొక్కను ఉంచి దానిపై బ్యాండ్ ఎయిడ్‌తో పట్టీలా వేయండి. ఇలా కొద్ది రోజులు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి.

అరటిపండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి అవి దృఢంగా మారుతాయి.

Teethదోమలు లేదా ఏదైనా ఇతర కీటకాలు కుట్టినప్పుడు చాలా మంటగా ఉంటుంది. అవి కుట్టిన చోట అరటి తొక్కతో రుద్దడం వల్ల దురద తగ్గుతుంది.

నీటిలో ఉండే లోహాలను, ఇతర విషపదార్థాలను తొలగించడంలోనూ అరటి పండు తొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నీటిలో అరటి పండు తొక్కలను వేస్తే నీరు శుభ్రంగా మారుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR