ప్రోటీన్స్ అందుతాయని రోజూ చికెన్ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

నాన్ వెజ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది చికెన్. ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లో కోడికూర ఉండాల్సిందే. దీని వాసన తగిలితే గాని ఆ రోజు సండేలా అనిపించదు. ఇక కొంతమంది చికెన్ ప్రేమికులకు చికెన్ లేనిదే ముద్ద దిగదు. చికెన్‌తో వంద రకాలుగా వండుకోవచ్చు. ఇతర కూరలతో చికెన్ ఫ్రై తినవచ్చు. రోటీలు, చపాతీలు అన్నింట్లోకీ చికెన్ సెట్ అవుతుంది. అందుకే చాలా మంది దీన్ని డైలీ తింటున్నారు. మాంసంతో పోల్చితే… చికెన్‌లో ఫ్యాట్ తక్కువే. అందుకే ప్రజలు చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. అయితే చికెన్ అతిగా తింటే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

chickenవారం వారం అంటే చికన్ తింటే పర్లేదు కానీ రోజు మాంసం తింటే మాత్రం ప్రమాదం తప్పదంటున్నారు. రోజూ తినే ఆహారంలో ప్రోటీన్లు 35 శాతానికి మించి ఉండకూడదు. అంటే రోజూ 50 గ్రాముల కు మించి చికెన్ తినకూడదు. దీన్ని బట్టి వారానికి 350 గ్రాములు సరిపోతుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తింటే మాత్రం చికెన్ ద్వారా వచ్చే ప్రోటీన్‌ను శరీరం ఫ్యాట్‌గా మారి లోపలే పేరుకు పోతుంది. దానితో బరువు పెరగడం ప్రారంభం అవుతుంది. చికెన్ ఎక్కువగా తినేవారు ఉబ్బినట్లుగా అవుతూ బరువు పెరుగుతారు. నెమ్మదిగా రక్త నాళాల్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి గుండె సంబంధిత జబ్బులు రావడానికి కారణం అవుతుంది.

skin problemశరీరంలో ప్రోటీన్స్ మరీ ఎక్కువైతే ప్రమాదం తప్పదు. చికెన్ కొంచెం గా తిన్నప్పుడు దాన్ని అరగించుకోవటానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది. దాని వలన బరువు తగ్గుతారు. చికెన్‌ను తినాలనుకున్నపుడు వీలైనంత ఎక్కువ సేపు ఉడికించి తినాలి. ఎందుకంటే అందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది కరోనా లాగే ప్రమాదకరమైనది. తీవ్రమైన అనారోగ్యం కలిగేలా చేస్తుంది. అందువల్ల మంచి చికెన్ మాత్రమే తినాలి.

injection to henకోళ్లు త్వరగా పెరగడానికి, వ్యాధులు సోకకుండా బలిష్టంగా కావడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. అవి మనుషుల మీద విషం లా పనిచేస్తాయి. అంటే చికెన్ ఎక్కువగా తింటే , విషాన్ని తింటున్నట్లే. మాంసం దుకాణాల్లో హానికారక ‘ క్యాంపిలోబ్యాక్టర్ ‘ అనే వైరస్ చికెప్ చేరి ఆరోగ్యాలను దెబ్బతీస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సూపర్ మార్కెట్ లో లభించే ప్రాసెసింగ్ కోడి మాంసంలోనూ సగం వరకు ఈ బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఈ వైరస్ అత్వంత ప్రమాదకరమైనది డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. చికెన్ వేడికి ఉడికించినప్పటికీ ఆ వైరస్ అలాగే ఉండిపోతుందని తెలిపారు. ఎంత వేడినైనా భరించే శక్తి వాటికి ఉన్నట్లు వివరించారు.

nuts and dry fruitsఅలాగే కోళ్ళ పెంపకం దారులు వాడే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి చికెన్ ఎక్కువ తినేవారిలో వైరస్ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దీంతో చికెన్‌ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. వాటికి బదులుగా ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మచింది సూచిస్తున్నారు. చికెన్ లో లభించే ప్రోటీన్స్ కోసం బాదం, చేపలు, గుడ్లు, పప్పులు, గింజలు వంటివి తినడం శ్రేయస్కరం. చికెన్‌ను తగిన మోతాదులో తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిది.

chicken curryఅయితే చికెన్, మటన్ కంటే కూడా సి ఫుడ్ మంచిదనివైద్యులు చెబుతున్నారు. చేపలు,రోయ్యలు, వంటివి తీసుకోవడం అర్యోగానికి మేలని సూచిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండడం వల్ల రోజువారి ఆహారంగా కూడా తీసుకోవచ్చు. సి ఫుడ్ కేవలం మంచి షోషకపదార్ధాల ఉన్న ఆహారంగానే కాకుండా, గుండె పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి. శ్వాస సంబందిత, చర్మ వ్యాదుల నివారణకు చేపల ఆహరం ఉపయోగపడుతుంది. లేదు చికెనే తినాలి అనిపిస్తే నాటు కోడి తినడం ఉత్తమం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR