ఏ ప్రాంతంలో దీపావళి ఏ విధంగా జరుపుకుంటారో తెలుసా???

దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందరి ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. అయితే ఏ ప్రాంతంలో ఏ విధంగా దీపావళి జరుపుకుంటారో తెలుసుకుందాం….

మహారాష్ట్రలో హిందువుల పండగలలో ఇది అత్యంత ముఖ్యమైనది. గొప్ప వారు, పేదవారు, అన్ని వర్గాలవారు ఎక్కువ సంతోషంతో చేసుకునే పండుగ ఇది. ఈ పండుగరోజుల్లో ఇళ్లు అన్నీ దీపాలతో కలకలలాడుతూ వుంటాయి.

diwaliఆ సంవత్సరం పెళ్లి అయిన కొత్త అల్లుళ్ళను హిందువులు ఈ పండక్కి తప్పకుండా ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో ఆ అల్లుడికి విశేష గౌరవం చేస్తారు. అతన్ని ప్రత్యేక వాహనం మీద తీసుకువస్తారు. అతని రాకకు సంతోష సూచనగా బాణాసంచాకాలుస్తారు.
భోజన సమయంలో అతనికి కొత్తపీతాంబరాలు ఇచ్చి గౌరవిస్తారు. మామ పంక్తిన మామ ప్రక్కన కూర్చోపెడతారు. రకరకాల పిండివంటలు అతనికి వడ్డిస్తారు.

తొలినాడు చతుర్దశి. ఈ పండుగకు నరకచతుర్దశి అనిపేరు. విష్ణువు నరకాసురుణ్ణి సంహరించింది ఈనాడే ఈ పండుగ ఆ మహత్కార్యానికి స్మారకచిహ్నము. ఈనాడు అందరూ బాగా తెల్లవారగట్లే లేచి ఇంటినిండా దీపాలు పెడతారు.

houseఇంతలో ఆ ఇంటి నౌకరులు వచ్చి ఆముదపు ఆకులు,రెండు మూడు రకాల కూరగాయలు చుట్టి పెట్టి ఆపాట్లాన్ని తమయజమాని యొక్క, అతని బిడ్డల యొక్క తలల చుట్టూ మూడుసార్లు దిగతుడుస్తారు. దిగతుడుస్తూ వారు ఇలా అంటారు. “అన్ని బాధలు, అన్ని పీడలు పరిహారం ఐపోవునుగాక! బలిరాజ్యం వచ్చును గాక”

నౌకరులు ఈ మాదిరిగా దిగతుడుపు, దీవెన చేసిన తరువాత ఇంటిలో అందరూ వంటికి సుగంధ నూనె రాసుకొని ఇంటి ముంగిలిలో వేడినీళ్లతో తలంటి పోసుకుంటారు.

puvvuతెలుగు వాళ్ళు దీపావళినాడు సాయంత్రం ప్రదోష కాలంలో పిల్లలు దివిటీలు కొట్టే ఆచారం ఉంది. ఈ ఆచారం పితృదేవతలకు వెలుగుచూపించే నిమిత్తం వేసే కాగడాల కరణీయ విధానం నుండే పుట్టుకువచ్చినట్లు తెలుస్తుంది.

ఈ దివిటీలు కొట్టడానికి తెలుగు వారు ప్రధానంగా గోగుదుత్తలు, గోగుకర్రలు కాని చెరకు కర్రలు కాని, ఆముదపు కర్రలు గాని ఉపయోగిస్తారు. నూనెలో గుడ్డ వత్తులు నానబెట్టి ఉంచుతారు. చిగుళు తెంపని గోగుకొమ్మలు తెచ్చివాటి చివర పంగల్లో ఈ వత్తులు వేళ్లాడేటట్లు కడతారు. గోవులు ఇంటికి వచ్చేవేళ ఈ వత్తులు వెలిగించి ఆ వత్తులు బాగా వెలుగుతూ ఉండగ వీధి వాకిటిలో కొడతారు. పెళ్లికాని ఆడపిల్లలు, మగపిల్లలు చిన్నవాళ్లు మాత్రమే ఈ ప్రక్రియ జరుపుతారు. ఆ దివిటీలు కొట్టేటప్పడు దుబ్బూ దుబ్బూ దీపావళీ మళ్లీ వచ్చే నాగుల చవితి ఫుట్టవిూద పాట్ట కర్ర పట్టకురా బావమరిది అనే పాట పాడుతారు. ఈ పాట పాడుతూ వాటిని కొట్టి ఒక వైపు పారేసి వచ్చి కాళ్ళు చేతులు కడుగుకొని తీపి పదార్థం తింటారు.

narakasuraఈ పూజను గుజరాతీలు, మార్వాడీలు మహనీయంగా చేస్తారు. లక్ష్మీపూజ వల్ల రెండు విధాలైన లాభాలు ఉంటాయి. ఇదువరకే ఆ యింట ఉన్న లక్ష్మి తొలగిపోక స్థిరంగా ఉండిపోతుంది. కొత్త లక్ష్మి కూడా వస్తుంది అని నమ్మకం. లక్ష్మి రాకను కోరే ఈ సందర్భంలో గృహాలంకరణ లాంటివి విరివిగాను, విశేషంగానూ సాగుతుంటాయి.

lakshmi deviలక్ష్మీదేవి ఈనాడు భూలోకానికి దిగివచ్చి ఇల్లిల్ల తిరుగుతుందని శుభ్రంగా ఉన్న ఇళ్లలో తన కళను ఉంచి పోతుందనీ భారతీయుల నమ్మిక, అందుచేతనే భారత స్త్రీలు ఈ పండుగకు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. పగిలిపోయిన, పనికిరాని వస్తువులను తీసిపారేస్తారు. లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తారు. ఆమె విగ్రహం ముందు తమ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు నగలు నాణేలు ఉంచుతారు.

diwali celebrationగుజరాత్, రాజస్తాన్ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఈనాడు చిత్రమైన ఉత్సవం ఒకటి చేస్తారు. వారు గుమికూడుతారు. ఆవు విగ్రహాన్ని కాని, ఎద్దు విగ్రహాన్ని కాని ఊరేగిస్తూ నది వద్దకో, చెఱువు వద్దకో వెళతారు. శ్రీకృష్ణుడు కాచిన గోవుల మందకు ఇది చిహ్నం. అక్కడ ఆ విగ్రహానికి స్నానం చేయిస్తారు. ఆ పిమ్మట పూజ చేస్తారు, పాటలు పాడతారు. అలనాడు శ్రీకృష్ణుని చెంత నాట్యం చేసిన గొల్లపడుచులను అనుకరిస్తూ నాట్యం చేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR