Home Unknown facts విష్ణుపురాణం ప్రకారం పాతాళంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో తెలుసా ?

విష్ణుపురాణం ప్రకారం పాతాళంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో తెలుసా ?

0

పాతాళలోకం గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అసలు పాతాళలోకం నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడుంది? పాతాళంలోలోకం వెనుక దాగివున్న కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం… మన పురాణాల ప్రకారం మొత్తం మూడు లోకాలు ఉన్నాయి. అవే స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం.

పాతాళంభూలోకం అంటే ఇప్పుడు మనం నివసిస్తున్నదే. మానవులకు, చరాచరజీవులకు నిలయం. స్వర్గలోకం ఆకాశంలో ఉంటుందని అక్కడ దేవతలు నివసిస్తుంటారని ప్రతీతి. భూమిపై పుణ్యాలు చేసిన వారు స్వర్గ లోకానికి వెళ్తుంటారని చెబుతుంటారు. ఇక మూడోది పాతాళ లోకం.. దీన్నే పాతాళం అని కూడా అంటారు. పాతాళ లోకం భూమి కింద భాగంలో ఉంటుందని, ఇక్కడ రాక్షసులు, యక్షులు, నాగజాతి వారు ఉంటారని చెబుతుంటారు. విష్ణుపురాణం ప్రకారం పాతాళంలో ఏడు రాజ్యాలు ఉన్నాయని చెబుతారు. భాగవత పురాణం, పద్మ పురాణాల ప్రకారం ఈ ఏడు రాజ్యాలను అతళ, వితళ, సుతళ, తలాతళ, మహాతళ, పాతాళ అని అంటారు.

రామాయణంలో కూడా పాతాళ లోకం గురించిన ప్రస్తావన వచ్చింది. బాలకాండలో విశ్వామిత్రుడు సగరుని చరిత్ర చెబుతూ సాగారకుమారులు 60,000ల మంది కూడా ఎలా భూమిని వెతుకుతూ వెళ్ళారో భూమిని తొలుచుకుంటూ ఎలా పాతాళానికి వెళ్ళారో సవిస్తారంగా వివరిస్తారు.వారు అలా పాతాళంలో కపిలముని ధ్యానభంగం చేయటం ఆయన ఆగ్రహం చవిచూసి భస్మమైపోవటం,వారి భస్మాలపైన భూమినుండి గంగని అవతరింపజేసి,పారించి, పాతాళంలో వారి భాస్మరాసులపై ప్రవహింపచేసి వారిని తరింపజేస్తాడు భగీరథుడు.

ఆ ప్రదేశమే కపిలారణ్యంగా ప్రసిద్ధిచెందిందని చెప్తారు.అంతేకాకుండా రామరావణ యుద్ధసమయంలో రావణుడికి సోదర వరసైన మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి సొరంగమార్గం ద్వారా పాతాళానికి తీసుకువెళ్ళాడని రామాయణంలో వుంటుంది. అదే మార్గంద్వారా హనుమంతుడు పాతాళానికి వెళ్లి రామలక్ష్మణులను కాపాడారని అక్కడ కధలుకధలుగా చెప్పుకుంటారు. పురాణాల ప్రకారం భూమినుండి 50000 యోజనాల దూరంలో పాతాళం ఉన్నది.

ఈ లెక్కన పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి అనేక మంది పండితులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అంటే భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉంటుంది కాబట్టి దాన్ని పాతాళంగా వ్యవహరించారు. అమెరికాలో వెలుగు చూసిన ఎన్నో పురాతన శివాలయాలు, నారసింహ చిత్తరువులు, Oregonలో ఒక పెద్ద సరస్సులో ప్రపంచంలో అతి పెద్ద శ్రీయంత్రం బయలు పడడం ఇవన్నీకూడా పాతాళం అంటే ఇప్పటి అమెరికా అనే ఆధారాలు చూపుతున్నవే. భారతదేశం నుంచి భూమిలోకి నిలువుగా సొరంగం త్రవ్వితే ఇప్పుడున్న అమెరికా ఖండానికే చేరుకుంటామని గట్టిగా వాదించేవారు కూడా ఉన్నారు.

 

Exit mobile version