కివితో శరీరానికి ఎన్ని విటమిన్లు లభిస్తాయో తెలుసా?

కరోనా వచ్చినప్పటి నుండి పండ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి కారణం జనాలకు ఆరోగ్యం పై శ్రద్ధ పెరగడం ఒకటైతే.. మరొకటి  పోషకాలనేవి ప్రాసెస్ ఫుడ్స్‌లో కన్నా కూడా..  సహజ సిద్ధమైన పండ్లు, కాయగూరలలో ఎక్కువగా లభించడమే. ఇక మన శరీరానికి కావాల్సింత ఎక్కువ పోషకాలను అందించే పండ్లలో  కివి కూడా ఒకటి. చూడటానికి దీని ఆకారం సపోట ని పోలిఉంటుంది. కానీ గుడ్డు ఆకారం లో ఉంటుంది. కోసి చూస్తే అనేక గింజల తో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు తో ఉంటుంది.
కాస్త విచిత్రంగా కాస్త ఆకర్షణీయంగా కనిపించే కివి పండులో పోషక విలువలు అపారంగా ఉంటాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఆ కారణంగానే.. దీనిని ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు చెబుతుంటారు. 100 గ్రాముల కివి పండులో.. 61 క్యాలరీలు, 0.5 గ్రాముల కొవ్వు, 3 మిల్లి గ్రాముల సోడియం, 312 మిల్లి గ్రాముల పొటాషియం, 1.1 గ్రాముల ప్రోటీన్ & 15 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.
అలాగే విటమిన్స్, మినరల్స్ విషయానికి వస్తే…విటమిన్ A – 1%, క్యాల్షియం – 0.03, విటమిన్ సి – 1.54, ఐరన్ – 1%, విటమిన్ B6 – 5%, మెగ్నిషియం – 4% లు కివి పండులో లభిస్తాయి. అందుకనే ఎవరికైనా శరీరంలో విటమిన్లు, మినరల్స్ కొరత ఉంటే.. వారు కివి పండుని తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
కివి పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరెంజ్ లో కంటే కివి పండులో విటమిన్-సి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోజులో తినవలసిన పోషకాలకు ఒక కివి పండు తింటే చాలని స్టడీ తెలుపుతోంది. కివి పండు శ్వాస సంబంధిత ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కనీసం వారానికి ఒకసారి చిన్న పిల్లలకు తినని వారికంటే 44 శాతం తక్కువ దగ్గు జలుబు సమస్యలకు గురయ్యారని తెలుపుతోంది.
ఇందులో కొవ్వు, సల్ఫర్ తక్కువగా ఉంటుంది కనుక గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారం తో పాటు  కివి తింటే ఫలితం కనిపిస్తుంది. అరటి పండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుంది. అరటి పండుతో పోలిస్తే క్యాలరీలు కూడా తక్కువ ఉండడంతో గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సోడియం లెవెల్స్ కూడా తక్కువే. సోడియం రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
కివి తిన్నవారి లో శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువ గా ఉంటుంది. ఈ పండులో ఉండే  లుయిటిన్ పదార్ధం కంటి చూపును కాపాడుతుంది. కివి నుంచి తీసిన రసం చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇక ఈ పండులోని ‘ఐనోసిటాల్’ పదార్ధం డిప్రెషన్ చికిత్స కు ఉపయోగపడుతుంది. గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి, కాలేయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి , రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా కివి పండు సహకరిస్తుంది.
కివి పండులో క్యాన్సర్‌కు దారితీసే జన్యు మార్పులను నిరోధించే పదార్ధం గుర్తించినట్లు పరిశోధనల్లో తెలిసింది. కివి పండు లో ఫోలిక్ యాసిడ్ అధికం గా ఉండడం వలన గర్భం తో ఉన్న స్త్రీలు దీనిని తీసుకుంటే చక్కని ప్రయోజనం కలుగుతుంది. ఫోలిక్ యాసిడ్లు గర్భస్థ శిశువులో  నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. కివి తీసుకోవడం వలన గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లు అందేలా చేస్తుంది.
పండ్లను ఆహారంగా తీసుకుంటే అందులోని చక్కెర శాతంమన శరీరం లో ఉండే మధుమేహాన్ని ఇంకాస్త పెంచుతాయి. అయితే వేరే పండ్లలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కివి లోతక్కువ స్థాయిలో ఉండడం వలన,ఇది రక్తం లోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ పండులో ఉండే నీటి శాతం కూడా,మధుమేహం తో ఉన్నవారు  తీసుకునే డైట్‌కి సరిపోయేవిధంగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR