రుద్రాక్షలనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి అయినప్పటికీ అన్ని రకాల రుధ్రాక్షలు ధరించ కూడదని పండితులు చెబుతున్నారు. శివ మహాపురాణం ప్రకారం ఒకానొక కల్పకాలంలో రుద్రుడు కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో లీనమై ఉండిపోయాడు.

Rudrakshaతపస్సు చాలించి కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాలలో మలయ ; సహ్యాద్రి పర్వతాలలో పడి – కాలాంతరాన అవే రుద్రాక్షలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. రుద్ర (దుఃఖములను) క్షయము (నాశనము చేయు గుణము); రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్ల వీటికి రుద్రాక్షలనే పేరు వచ్చింది.

Rudrakshaనాలుగు వర్ణాల భక్తులకూ ధారణ యోగ్యమైనవి ఈ రుద్రాక్షలు. బ్రాహ్మణులు తెల్లనివీ – క్షత్రియులు ఎర్రనివి, వైశ్యులు పసుపు రంగువీ, అన్నీ కలిసిన వర్ణాలు ఇతర వర్ణాలవారూ ధరించవచ్చు. జపం చేసుకోవడానికి ధారణకు కూడా చిన్న రుద్రాక్షలే అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.

Rudrakshaగురివింద గింజ పరిమాణంలో ఉండే రుద్రాక్షలే శ్రేష్ఠమైనవి. ఇవికాక రేగుపండు – ఉసిరికాయ పరిమాణంలో ఉండే రుద్రాక్షలు కూడా లభిస్తాయి. అయితే రుద్రాక్షలన్నీ ధరించదగ్గవికావు. రుద్రాక్ష అనగానే శుభప్రదమైనవిగా భావిస్తాము. కానీ కొన్ని రుద్రాక్షల విషయంలో అశుభదాయకమైనవీ ఉన్నాయి.

Rudrakshaపగిలినవీ, పురుగులు పట్టినవీ, గుండ్రంగా లేనివీ, కండలేనివీ పనికిరావు. వీటితో జపమైనా నిషిద్ధమే. ధారణకైనా, జపానికైనా నునుపుగా, కంటకయుతంగా, గట్టిగా ఉండే రుద్రాక్షలు ఎంపిక చేసుకోవాలి. మాల ఏర్పడాలంటే సూత్ర ద్వారం ఉండాలి. కనుక, దానికి సహజంగా ఏర్పడిన రుద్రాక్ష శ్రేష్ఠం. ఇక పదకొండు వందల రుద్రాక్షలను ధరిస్తే ఆ వ్యక్తిని సాక్షాత్‌ శివస్వరూపుడిగా భావిస్తారు

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR