సంక్రాంతి పండుగను ఏ ప్రాంతంలో ఎలా జరుపుకుంటారో తెలుసా???

ముంగిట్లో ఇంద్ర ధనుస్సును నిలిపే రంగవల్లులు.. నోరూరించే పిండి వంటలు, కొత్త లుక్ ఇచ్చే సాంప్రదాయ దుస్తులు.. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండగ శోభ ఎంతో వైభవాన్ని తలపిస్తుంది. తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు.
గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా పిలుస్తారు. రెండో రోజును ‘మకర సంక్రాంతి’గా, మూడో రోజును ‘కనుమ’గా పిలుస్తారు. నాలుగో రోజును ‘ముక్కనుమ’ అంటారు.
సంక్రాంతి కేవలం మన రాష్ట్రంలోనే కాదు తెలుగువాళ్ళు ఎక్కడుంటే అక్కడ మకర సంక్రాంతి మహా ఘనంగా జరుగుతుంది. ప్రవాసాంధ్రులు తెలుగుతనాన్ని మర్చిపోకుండా వీలైనంతవరకూ పండుగ సాంప్రదాయాలేవీ లోపించకుండా కళకళలాడేలా వైభవోపేతంగా జరుపుకోవడం మనకు తెలిసిందే.
మరో సంగతి ఏమంటే మకరసంక్రాంతి తెలుగువారి పండుగ మాత్రమే కాదు. కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాలవాళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు.
తమిళులు నాలుగు రోజులపాటు సంక్రాంతి పండుగ వేడుక చేసుకుంటారు. మొదటిరోజును ”తై” నాడు సూర్యుని, వానదేవుని ప్రార్థిస్తారు. రెండోరోజు ”పొంగల్”, మూడోరోజు ”మత్తు పొంగల్”, నాలుగోరోజు ”తిరువళ్ళువర్”. వీటిని మనం వరుసగా భోగి, పండుగ, కనుమ, ముక్కనుమ అంటాం.
బెంగాలీలకు సంక్రాంతి గొప్ప పండుగ. అత్యుత్సాహంతో వేడుక చేసుకుంటారు.
ఉత్తరప్రదేశ్ లో సంక్రాంతిని ”ఖిచ్రి” అంటారు. గంగా, యమునా, సరస్వతి సంగమ తీరంలో నదీ స్నానం చేస్తారు. గంగా తీరంలో పెద్ద ఎత్తున భోగిమంటల ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
పంజాబులో భోగి పండుగను ”లోహ్రి” అని, సంక్రాంతిని ”మఘీ” అని అంటారు. ఈ పండుగ మహోత్సవం సందర్భంగా భాంగ్రా నృత్యం చేస్తారు.
మధ్యప్రదేశ్ లో సంక్రాంతిని ”సుకరాత్” పేరుతో ఆనందంగా జరుపుకుంటారు.
మహారాష్ట్రలో సంక్రాంతి సందర్భంగా నువ్వులతో పిండివంటలు తయారుచేస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR