వెల్లుల్లితో అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసా ?

0
328

వెల్లుల్లి అనగానే ఆరోగ్యానికి మంచి ఔషధం అని గుర్తుకొస్తుంది. శరీరానికి వేడి పెంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అయితే వెల్లుల్లితో ఆరోగ్యం ఒక్కటే కాదు అందం కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా ముఖంపై ఇబ్బందిపెట్టే మొటిమలను నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.

beauty tips with garlicఇది బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్‌ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్‌ వలె పనిచేస్తాయి. క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లితో అందాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో కొన్ని చిట్కాలు చూద్దాం…

వెల్లుల్లి రెబ్బలను మిక్స్‌ చేసి అందులో వెనిగర్‌ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట కాటన్‌ బాల్‌తో రాయాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేయండి. ఇలా తరుచూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

beauty tips with garlicవెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. ఈ మిశ్రమాన్ని మొటిమలు మీద రాసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత నీటితో శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.

beauty tips with garlicగుడ్డులోని తెల్లసొనలో చర్మం మీద మృతకణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు, పోషకాలతో నిండి ఉంటాయి. ఒక గిన్నెలో, గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్‌, తెల్ల గుడ్డు సొన మిశ్రమంలా కలపండి.

beauty tips with garlicమొటిమలు ఉన్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.. ఎండిపోయే వరకు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక సాధారణ నీటితో కడిగేయండి.

 

SHARE