ఇక్కడ అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలో తెలుసా!!

ఎన్నో పురాతన ఆలయాలకు నెలవు భారతదేశం. వింతలు విశేషాలు ఎన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఇలా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో అమ్మవారి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ఎన్నో అష్టాదశ శక్తిపీఠాలుగా అమ్మవారికి ఆలయాలు ప్రసిద్ధి చెంది భక్తులకు దర్శనమిస్తున్నాయి.

ammavaruఈ విధంగా ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాలలో అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం ఒకటి. భక్తులు కోరిన కోరికలను నెరవేర్చుతూ దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆలయమే మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం. మరి ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ammavaruఈ ఆలయ విషయానికి వస్తే పాండాసురుడనే రాక్షసుడి నుంచి ప్రజలను రక్షించడానికి జగన్మాత పరాశక్తి యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరథంపై ఆసీనురాలై లలితాంబికగా ఆవిర్భవించింది.

shivalingaఈ ఆలయంలో పరమేశ్వరుడు అమ్మవారి అభయ హస్తంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని భక్తులు అమ్మవారిని నేతిలో దర్శనం చేసుకోవడం వల్ల వారికి ఉన్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి గొడవలు ఉండవని భక్తులు భావిస్తారు.

family issuesఇక ఈ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యంగా అన్నం సమర్పిస్తారు. అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదం తీసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని భక్తులు భావిస్తారు. ఇక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR