Home Health విషముష్టి గింజలు ఎలా ఉపయోగించాలో తెలుసా?

విషముష్టి గింజలు ఎలా ఉపయోగించాలో తెలుసా?

0

ప్రకృతిలోని ప్రతీ మూలికా, ప్రతీ మొక్క ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. విషముష్టి మొక్క కూడా ప్రకృతి ఒడిలో పుట్టిన ఒక ఆయుర్వేద మొక్క. ఈ చెట్టు ఆకుల నుంచి చెట్టు బెరడు, కాయలు అన్నీకూడా విసపూరితమైనవి. ఈ చెట్టు యెక్క గింజలు భాగా శుద్ది చేస్తే మందులకు అద్బుతంగా పనిచేస్తాయి. కానీ శుద్దులు సక్రమంగా చేయాలి.

digestionఈ చెట్టు ఆకులతో చర్మరోగాలకు పైకి లేపనంగా తైలం తయారు చేసి వాడుకొవచ్చు. ఈ చెట్టుయెక్క బెరడును, మన శరీరంలో ఉండే రాచపుండుపై ఉపయోగించవచ్చు. ఈ బెరడును కాల్చి మసి చేయాలి. బూడిద చేయకూడదు మసి చేసి ఈ మసిని మానకుండా ఉండే రాచ పుండ్ల పైన వేయాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే పుండ్లు మానిపోతాయి.

ఈ చెట్టును పై చర్మం తీసి కొద్దిగా రంధ్రం చేసి ఆ రంధ్రంలో బెల్లం ముక్క లోపల ఉంచి మరలా చెట్టు బెరడును మూసి పైన బట్టతో కట్టేసి ఒక మూడునెలల తర్వాత తిరిగి రంధ్రంలోని బెల్లంను తీసుకోవాలి. ఈ బెల్లాన్ని పెనం మీద 2 నిముసాలు వేయించి భద్రపరుచుకొని, పాములు కరిచినప్పుడు కొద్దిగా తిని కరిచిన చీట ఈ బెల్లంను కొద్దిగా పెడితే విషం విరిగిపొతుంది.

“విషముష్టి” హోమియోపతిలో విస్తృతంగా జ్వరాలు మరియు ధనుర్వాతంకి ఉపయోగిస్తారు. ఇది అధిక రక్తపోటు మరియు గుండె దడ చికిత్స కోర్సు లో ప్రభావవంతంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన చెట్లు కూడా ఉన్నాయి.

అశ్వని నక్షత్రం – వారు విషముష్టి లేదా జీడిమామిడిని పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కలుగుతుంది. అలాగే, అన్ని విషయాలలోనూ సూటిగా వ్యవహరించడం, సమయాన్ని వృదా చేయకుండా అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది.

విశముస్టి గింజలు కేజీ : 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉంటాయి. జీర్ణ వ్యవస్థ, కాలేయం మరియు పిత్తాశయం వాపు కోసం ఈ గింజలతో చేసిన మందు ఉపయోగిస్తారు. మలబద్ధకం మరియు దీర్ఘకాలిక హెపటైటిస్, మత్తు అనారోగ్యాలు, పెద్దప్రేగు శోథ మరియు పొట్టలో పుండ్లు కోసం ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ అల్సర్, అపానవాయువు మరియు పేగు డిస్బయోసిస్ మందుల్లో ఉపయోగించబడుతుంది.

 

Exit mobile version