తెల్ల రక్తకణాలు శరీరాన్ని వ్యాధుల నుండి ఎలా రక్షిస్తాయో తెలుసా ?

తెల్లరక్తకణాలు మన శరీరాన్ని రోగాలనుంచి కాపాడతాయి. రోగాలు దాడి చేసినప్పుడు వాటి అంతు చూస్తాయి. అదే తెల్లరక్తకణాల సంఖ్య పడిపోతే రోగాల దాడిని అడ్డుకోవడం కష్టం. తెల్ల రక్తకణాలు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి తోడ్పడతాయి. ఇవి మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి సైనికుల్లా పోరాడతాయి.

తెల్ల రక్తకణాలుఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు తెల్ల రక్తకణాలు పడిపోవడం జరుగుతుంది.

తెల్ల రక్తకణాలుఈ తెల్ల రక్తకణాలు తగ్గడం వల్ల శరీరం క్రమంగా క్షీణిస్తుంది. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, బద్ధకంగా ఉండటం, తరచు వ్యాధుల బారిన పడటం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే కొన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటి ఆక్సిడెంట్ లు మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వీటి సంఖ్యను పెంచుకోవచ్చు.

తెల్ల రక్తకణాలుతీసుకునే ఆహారంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండే క్యారెట్, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి. మరియు జింక్ అధిక మొత్తంలో లభించే గుమ్మడికాయ, పుచ్చకాయ, వెల్లుల్లి వంటివి తీసుకోవడం మంచిది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి వంటివి అధిక మొత్తంలో తీసుకోవాలి.

తెల్ల రక్తకణాలుగ్రీన్ టీ తీసుకోవడం ద్వారా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పాల కుర, బ్రకోలి, చిలకడ దుంపల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లు రాకుండా నివారిస్తాయి.

Green Teaఇంకా చేపలు, పాలు, పాల ఉత్పత్త్హులు వంటి వాటిలో తెల్ల రక్త కణాలను పెంచే విటమిన్లు పుష్కలం గా లభిస్తాయి

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR