అభ్యంగన స్నానం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా

పండగ వచ్చినపుడు ప్రత్యేక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక పత్యేక కార్యక్రమమని అందరికి తెలుసు. తలంటు స్నానాన్ని అభ్యంగన స్నానమని అంటారు. కొబ్బరి నూనె, నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అభ్యంగన స్నానానికి వాడవొచ్చు. నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి .కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును తీసేయాలి. తర్వాత శరీరమంతా శుభ్రపడేలా శుద్ధమైన నీళ్ళతో స్నానం చెయ్యాలి.

abhyanga snanamఈ విధముగా చేయడం వల్ల గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొదలైన చర్మ రోగాలు ,చేడు కళలు దరి చేరవు. శరీరం మీద మలినాలను ,దుర్గందాలను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చలవ చేస్తుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది. వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.

abhyanga snanamసుఖ నిద్ర పడుతుంది. కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి . దేహం కాళ్ళు చేతులు ,గోళ్ళు, తలలో పుట్టిన మంటలను పోగొడుతుంది. మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వల్ల చెవులకు , మిగిలిన అవయవాలకు బలం ఇస్తుంది.

abhyanga snanamఅభ్యంగన స్నానం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన పూర్వీకులు అభ్యంగన స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. ఆధునిక యుగంలో అభ్యంగన స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వల్ల దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం అభ్యంగన స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా అభ్యంగన స్నానం చేస్తే ఏంటో మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR