అలసందలు ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తాయో తెలుసా ?

ప్రకృతిలో సహజసిద్దంగా లభించే చిక్కుడు మొక్కకు సంబంధించినవే అలసందలు. వీటినే బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందలు రుచికరంగా మరియు మంచి ఫ్లేవర్‌ను కలిగి ఉంటాయి. లెగ్యుమ్ జాతికి చెందిన అలసరందలు ఇంగ్లీష్ లో కౌపీస్ లేదా బ్లాక్ ఐడ్ పీస్ అని కూడా అంటారు . అలసందల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ కలిగి ఉండి మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు సహాయపడుతాయి. అలసందలు ఆరోగ్యానికి ఎటువంటి మేలు చేస్తాయో చూద్దాం.

డయాబెటిస్ ను తగ్గిస్తుంది :

Health Benefits of Alasandaluఇతర లెగ్యుమ్ జాతి ధాన్యాలతో పోల్చితే అలసందల్లో గ్లిజమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను నార్మల్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతాయి :

Health Benefits of Alasandaluఅలసందల్లో తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉటుంది. బరువు తగ్గించడంలో ఫర్ఫెక్ట్ ఫుడ్ గా సహాయపడుతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది . వీటిని తినడం వల్ల మీ పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి చెందుతుంది. ఎక్కువ సమయం ఆకలి అవనీయ్యదు.

ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది :

Health Benefits of Alasandaluఅలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా సహాయపడుతుంది. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరటాక్సిన్స్ ను నివారిస్తుంది మరియు ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది :

Health Benefits of Alasandaluఅలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. మరియు హార్ట్ డిసీస్ సంబంధిత వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం మరియు మెగ్నిషయం గుండె ఆరోగ్యానికి చాలా సహాయపడుతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :

Health Benefits of Alasandaluఅలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల పొట్టలో అనుకూల ప్రభావం కలిగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పొట్ట అసౌకర్యాన్ని నివారిస్తుంది . మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

చర్మఆరోగ్యానికి మంచిది :

Health Benefits of Alasandaluఅలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హానిజరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR