ఇంటికి వేసే రంగులుతో ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో తెలుసా

ఇళ్లకు పెయింట్స్ వేసుకునేటప్పుడు ఏ కలర్ వేసుకుంటే బెటర్ అన్నది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కొక్కరికీ ఒక్కో కలర్ నచ్చుతుంది. కొందరికి బ్లాక్ నచ్చితే, కొందరికి అస్సలు నచ్చదు. కొందరు రెడ్ అంటే ఇష్టపడతారు. మరికొందరు రెడ్‌ని చూస్తే చాలు చిర్రెత్తిపోతారు. అయితే… మానసికవేత్తలు మనుషులకూ, కలర్స్‌కీ మధ్య సంబంధాల్ని పరిశోధించారు. మరి ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో, ఇళ్లలో ఎలాంటి కలర్స్ వేసుకుంటే, ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకుందాం.

benefits of any colors with home dyes->సాధారణంగా ఇళ్లకు వేసే కలర్స్ లో వైట్ కలర్ ని ఎక్కువగా చూస్తుంటాం. నిజానికి ఇళ్లకు వైట్ కలర్‌ని మించిన కలర్ మరొకటి లేదు. అయితే ఎప్పుడూ వైట్ కలరే వేసుకుంటే కూడా మనసుకి నచ్చదు. అందుకే వైట్‌తోపాటూ కొన్ని ఇతర కలర్స్ కాంబినేషన్ కూడా ఉండేలా చేసుకోవాలి. కానీ అవి ఎలాంటివి?

benefits of any colors with home dyes-> ఆకాశం బ్లూ కలర్‌లో కనిపిస్తూ విశాలమైన ఫీలింగ్ కలిగిస్తుంది. అందువల్ల ఇళ్లకు స్కై బ్లూ కలర్ వేసుకుంటే… మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా డోర్స్, విండోస్‌ కి ఇలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది.

benefits of any colors with home dyes-> ఈ ప్రపంచలో గ్రీన్… ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇళ్లలో గ్రీన్ కలర్ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నేచర్‌లో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా ఇంట్లోని స్టడీ రూంలో గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటే, పిల్లలు బాగా చదువుతారట. ఒత్తిడి, టెన్షన్లు తగ్గాలంటే గ్రీన్ కలర్ ది బెస్ట్.

benefits of any colors with home dyes->రెడ్ కలర్ ఎంత ఎక్కువగా ఉంటే, టెన్షన్లు అంతలా పెరుగుతాయి. రూం నిండా రెడ్ కలర్ ఉంటే, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాబట్టి ఇది వీలైనంత తక్కువగా ఉండేలా చేసుకోవాలి. అయితే ఈ కలర్ ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. అందువల్ల ఇళ్లలో ఫ్రేములు, ర్యాక్స్, షెల్ఫులకు రెడ్ కలర్ వేసుకుంటే లుక్ బాగుంటుంది.

benefits of any colors with home dyes->కలర్స్‌లో అత్యంత ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేది ఎల్లో కలర్. కానీ ఇది బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంతవరకూ ఇళ్లలో ఎల్లో కలర్ వాడవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు.

benefits of any colors with home dyes->ఆరెంజ్ అనేది ఎల్లో, రెడ్ కలర్స్ కాంబినేషన్. కానీ ఇది మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఉత్సాహాన్ని కలిగించే, చురుకుదనాన్ని పెంచే లక్షణాలు ఆరెంజ్‌లో ఉన్నాయి. ఎట్రాక్ట్ చేసే గుణం కూడా ఉంది. అందువల్ల ఇళ్లలో ఆరెంజ్ కలర్ వేసుకుంటే మంచిది.

-> ప్రేమకి గుర్తుగా భావించే పింక్ కలర్ మనలో ప్రశాంతతను కలిగిస్తుంది. కోపం, ఆవేశాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో పింక్ కలర్ ఉంటే, బీపీ తగ్గడమే కాక, గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుందట.

benefits of any colors with home dyes-> ఇది వరకు బ్లాక్ కలర్‌ను చెడుకు సంకేతంగా భావించేవారు. ఇప్పుడు కాలం మారింది. బ్లాక్ కలర్ పెయింట్ హై క్వాలిటీతో ఉంటుంది. అందువల్ల ఇళ్లకు బ్లాక్ కలర్ వేస్తే… ఇంపుగా ఉంటుంది. ఐతే… లైటింగ్‌ని తగ్గించే శక్తి బ్లాక్‌కి ఉంది. ఇంట్లో కాంతి బాగా ఉండాలంటే బ్లాక్ కలర్‌ని దూరం పెట్టాల్సిందే.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR