నేరేడు పండు వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

ఉచితంగా దొరికింది ఎంత విలువైనదైన ఖరీదైన వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఇక ఆహరం, పండ్ల విషయంలో అయితే ఖరీదు ఎక్కువంటే పోషకాలు ఎక్కువ అనే మైండ్ సెట్ లో ఉంటాం. అందుకే ఫ్యాన్సీ గా కనిపిస్తే చాలు ఆ పండ్ల వెంటపడుతుంటాం. అవే ఆరోగ్యప్రయోజనాలు, అంతే పోషకవిలువలున్న స్థానికంగా దొరికే పండ్లను కాస్త చిన్నచూపే చూస్తాం. బ్లూ బెర్రీ యాంటీఆక్సిడెంట్ల విషయంలో రారాజు అని చెప్పవచ్చు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని స్మూతీ బౌల్, పాన్ కేక్, జ్యూస్ ఇలా అనేక రకాలుగా వాడుతుంటాం.

నేరేడు పండుబ్లూబెర్రీస్ లో క్యాలరీలు తక్కువ, పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని పోషకాహరపండుగా వర్ణిస్తారు. వీటిలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లతో పాటు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ అయిన ఆంథోసైనిన్స్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి DNA డ్యామేజ్ కాకుండా చూస్తాయి. క్యాన్సర్, గుండెజబ్బులు దరిచేరనివ్వవు. డయాబెటిక్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తపోటును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కానీ ఇది మన దేశీయంగా పండదు కాబట్టి.. ధరలు ఆకాశంలో ఉంటాయి.

నేరేడు పండుఅయితే బ్లూ బెర్రీస్ లోని అన్ని రకాల సుగుణాలు మన దేశీయంగా దొరికే అల్లనేరేడు పండ్లలో ఉంటాయని పోషకాహారకాహార నిపుణులు చెబుతున్నారు. ధర విషయంలోనూ చాలా చవకలో అందుబాటులో ఉంటాయని అంటున్నారు. అందుకే పండ్ల విషయంలో విదేశీ మోజు తగ్గించుకుని సీజనల్ గా స్థానికంగా దొరికే వాటివైపు మొగ్గుచూపాలని అంటున్నారు. అందరికీ అందుబాటులో వుండే ఈ అల్లనేరేడు పండును ఇండియన్ బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీన్నే ‘దేవతా ఫలం’ అని కూడా అంటారు. నల్లగా నిగనిగగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

నేరేడు పండునేరేడు పండు సీజనల్ ఫ్రూట్. కేవలం ఈ కాలంలోనే అది దొరుకుతుంది. ఇప్పుడిప్పుడే నేరేడు పండ్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. సీజనల్ ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నేరేడులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది. నేరేడు ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ దీని పాత్ర అధికం.

నేరేడు పండుఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది ఆరోగ్యంగా ఉండటానికి నేరేడు పండు ఉపయోగపడుతుందని డాక్టర్లు అంటున్నారు. మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్నావాళ్ళు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది. అధిక రక్తపోటుకు గురికాకుండా చూస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

నేరేడు పండువీటిని తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అందాన్ని పెంచడంలోనూ దీని పాత్ర అధికమే. దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు.

నేరేడు పండుఅంతేకాకుండా కీళ్లనొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది. నేరేడులో విటమిన్ సీ,ఏ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలు, నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది. నేరేడుపండు లో సోడియం, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ, సితో పాటు రైబోప్లెనిన్, పోలిక్ యాసిడ్లను సమృద్దిగా ఉంటాయి కనుక వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. జిగట విరేచనాలతో బాధపడేవారు రోజుకు 2-3 చెంచాలా నేరేడు పండ్ల రసాన్ని ఇవ్వాలి. ఇలా చేస్తే రోగి శక్తితో పాటు పేగుల కదలిక నియంత్రణలో ఉంటాయి.

నేరేడు పండుజ్వరంలో ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేయడంతో పాటు నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు పండ్ల రసాన్ని నిమ్మరసంతో కలిపి గాయాలున్న చోట పూస్తే.. త్వరగా మానుతుంది. ఇది మాత్రమే కాదు దీనికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా ఉంది. గర్భిణీ తింటే తల్లికీ, బిడ్డకీ మంచిది. మెదడును చురుగ్గా ఉంచడానికి, హార్ట్ బీట్ సరిగా ఉంచడానికి నేరేడు ఔషధంలా పనిచేస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR