నల్ల ఉప్పు వల్ల కలిగే లాభాలేంటో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచి న‌ల్ల ఉప్పును వంట‌ల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడ‌కం త‌క్కువైంది. నల్ల ఉప్పును హిమాలయ ఉప్పు అని కూడా అంటారు. ఇది ప్రధానంగా భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర గనులలో లభిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో వందల సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. ఇందులో సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, సోడియం బైసల్ఫేట్, సోడియం బైసల్ఫైట్, ఐరన్ సల్ఫైడ్, సోడియం సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

నల్ల ఉప్పుఈ మూలకాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నల్ల ఉప్పులో యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి సాధారణ ఉప్పు కంటే సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఉన్నాయి. అయితే నిజానికి న‌ల్ల ఉప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. అలాంటి నల్ల ఉప్పు వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల ఉప్పుసాధారణంగా మన ఇళ్లలో చాలా మంది తెల్ల ఉప్పును వాడుతారు. అయోడైజ్డ్‌ సాల్ట్‌ అని చెప్పి మార్కెట్‌లో దొరికే ఉప్పును వాడుతారు. అయితే నిజానికి ఈ ఉప్పు కన్నా నల్ల ఉప్పును వాడడం ఎంతో శ్రేయస్కరం. పండ్ల రసాలతో కాస్త నల్ల ఉప్పును కలిపి తీసకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నల్ల ఉప్పును కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగితే ఫలితం కనిపిస్తుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

నల్ల ఉప్పునల్ల ఉప్పు వాస్తవానికి కాలేయంలో పిత్త ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఇది గుండెలో మంట, ఊబకాయం తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య ఉంటే మీరు చిటికెడు ఉప్పు తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. వేస‌విలో న‌ల్ల ఉప్పును రోజూ వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భించడమే కాకుండా.. వేడి చేయ‌కుండా ఉంటుంది.

నల్ల ఉప్పుషుగర్‌ పేషెంట్లకు నల్ల ఉప్పు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల వారి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. క‌డుపులో మంట‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం ఉన్న‌వారు, గుండెల్లో మంట ఉన్న‌వారు న‌ల్ల ఉప్పు తింటే మెరుగైన ఫ‌లితం ఉంటుంది. గ్యాస్ట్రిక్ స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డేవారు చిటికెడు న‌ల్ల ఉప్పు తింటే చాలు ఉపశమనం కనిపిస్తుంది.

నల్ల ఉప్పుజీర్ణ సమస్యలు ఉంటే నల్ల ఉప్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చిన్న ప్రేగులలో విటమిన్ల శోషణను పెంచడానికి సహాయపడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం సమస్యతో బాధపడేవారు రోజూ నల్ల ఉప్పును తింటే ఫలితం కనిపిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య ఉన్న‌వారు న‌ల్ల ఉప్పును రోజు తీసుకుంటే ఆ స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. నల్ల ఉప్పు చిన్నారులలో అజీర్ణం సమస్యను తగ్గిస్తుంది. ప్లీహం ఏర్పడకుండా ఉంటుంది. రోజూ పిల్లలకు ఆహారంలో నల్ల ఉప్పును ఇవ్వాలి. దీంతో వారిలో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

నల్ల ఉప్పునల్ల ఉప్పులో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన మినరల్స్‌ ఉంటాయి. అందువల్ల తరచూ నల్ల ఉప్పును తింటే ఎముకలు దృఢంగా మారుతాయి.

నల్ల ఉప్పుఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అయినప్పటికీ 6 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే దీని ఉపయోగం రక్తపోటును కూడా పెంచుతుంది.

నల్ల ఉప్పుసాధారణ ఉప్పు కన్నా నల్ల ఉప్పు ఎన్నో విధాలా మంచిదే. అయితే సాధారణ ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. కనుక దీన్ని చాలా స్వల్ప మోతాదులో వాడుకోవాలి. ఇక కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు ఈ ఉప్పును వాడకపోవడమే మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR