బ్రౌన్ షుగర్ వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా

మనం ప్రతిరోజు చక్కెరను ఏదో రకంగా వాడుతూనే ఉంటాం. కాఫీ టీ పాలు జ్యూస్ వీటిల్లో వేసుకుని తీసుకుంటూ ఉంటాం. ఇటీవల కాలంలో వైట్ చక్కెర మంచిది కాదని బ్రౌన్ షుగర్ వాడటం మొదలు పెట్టారు. బ్రౌన్ షుగర్ అంటే ముడి చక్కెర. వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ రెండూ క్యాలరీలు, పోషకాల పరంగా రెండూ ఒకేవిధంగా ఉన్నప్పటికీ, రంగు, రుచి, దీన్ని తయారుచేసే పద్ధతిలో మాత్రమె తేడా ఉంటుంది. బ్రౌన్ షుగర్ ని వంటకాలలో చేరిస్తే ఆ వంటకం చిక్కగా, మెత్తగా కనిపిస్తుంది.

benefits of brown sugar to the skinబ్రౌన్ షుగర్ తో ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖం జిడ్డు లేకుండా కాంతివంతంగా ఉండాలి అంటే బ్రౌన్ షుగర్ బాగా సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

benefits of brown sugar to the skinబ్రౌన్ షుగర్ ని పొడిచేసి దానిలో కొంచెం బియ్యప్పిండి కొంచెం పాలు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మంపై మృతకణాలు తొలగిపోయి ఉంటే ఈ ప్యాక్ ఫాలో అవ్వాలి.

benefits of brown sugar to the skinబ్రౌన్ షుగర్ పొడిలో కొంచెం తేనె కలిపి ముఖానికి పట్టించి నిదానంగా రబ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

benefits of brown sugar to the skin2 టీస్పూన్ల బ్రౌన్ షుగర్ లేదా చక్కెరను ఓ గిన్నెలో పోయండి. ఇందులో ఓ నిమ్మ చెక్క జ్యూస్ తీసి మిక్స్ చేయండి. ఓ పది హేను నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్‌కి అప్లయ్ చేసి.. మరో పది నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఈ బ్రౌన్ షుగర్, లెమన్ కాంబో.. చంక్లలో నల్లదనాన్ని తగ్గించడంతోపాటు బ్యాక్టీరియానూ నిర్మూలిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR