Home Health ఆముదం నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ఆముదం నూనె వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

ప్రస్తుత జనరేషన్ కి జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్య. ఇది కొంతమందిని మానసికంగా కూడా వేదనకు గురి చేస్తుంది. మనం గమనిస్తే పూర్వపు రోజుల్లో అందరికీ జుట్టు ఒత్తుగా ఉండేది. అంతేకాదు వాళ్ల జుట్టు అంత తొందరగా తెల్లబడేది కూడా కాదు. దానికి ప్రధానమైన కారణం ఆరోజుల్లో అందరూ తలకి ఆముదం నూనె ఉపయోగించేవారు.

benefits of castor oilఅయితే సహజంగా ఆముదానికి ఉండే ఘాటైన వాసన మరియు చిక్కదనం వలన క్రమక్రమంగా ఈ స్థానాన్ని కొబ్బరినూనె భర్తీ చేసింది. ఈ రోజుల్లో ఘాటైన వాసన,చిక్కదనం ఎక్కువగా ఉన్న ఆముదం నూనెను ఉపయోగించాలి అన్నా మనకి కుదరదు. కానీ వారంలో కనీసం ఒక్క సారైనా ఆముదాన్ని జుట్టుకు రాయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ఆముదము నూనె జుట్టు పొడవుగా మరియు మందంగా పెరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, జన్యుపర లోపాల వలన, అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో, ఒత్తిడి, మానసిక కారణాలు మరియు జీవనశైలిలో లోపల వలన కలిగే బట్టతలను తగ్గించుటకు చికిత్సగా కూడా ఆముదం నూనెని వాడతారు.

కొంతమంది జుట్టు చాలా బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలు తొందరగా ఊడిపోతుంది. అలా కాకుండా జుట్టు బలంగా ఉండాలంటే ఆముదం నూనె ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల దృఢమైన, పొడవాటి జుట్టును పొందుతారు.

ఆముదం నూనెను గోరువెచ్చగా చేసి ఆ గోరువెచ్చని ఆముదపు నూనెతో జుట్టుకు మసాజ్ చేసిన తరువాత, టవల్ ను తలపై ఇరవై నిమిషాలు కట్టుకోండి. కావాలనుకుంటే నూనె చిక్కదనాన్ని తొలగించడానికి ఒకటి నుండి రెండు చుక్కల నిమ్మరసం కలపండి. ఇలా చేయడం వలన వాడడం వల్ల జుట్టు మృదువుగా పెరుగుతుంది. ఈ నూనె జుట్టుకు తేమను ఇస్తుంది. మరియు తెల్ల వెంట్రుకలను తగ్గిస్తుంది.

అలాగే ఆముదం నూనెలో రెండు చుక్కల హొహోబా నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనెను కలిపి తలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు తగ్గటమే కాక జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా కనిపిస్తుంది

ఆముదం నూనె మంచి మాయిశ్చరైజర్‌గా, కుదుళ్లకు కండీషర్‌గా పని చేస్తుంది. తల బాగా నొప్పిగా, వేడిగా ఉన్నప్పుడు ఆముదం నూనెను రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తల నొప్పిని తగ్గించటంతో పాటు మృదువైన, కాంతివంతమైన వెంట్రుకలను అందిస్తుంది.

ఆముదము నూనెలో యాంటీ వైరల్, బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడంవల్ల చుండ్రును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే రికోనోలెసిక్ యాసిడ్ చర్మం యొక్క pH ను సమతుల్యం చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇది జుట్టు పెరగడానికి మరియు చుండ్రు తగ్గించడానికి అననుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.

 

Exit mobile version