దాల్చిన చెక్క వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

సుగంధ ద్రవ్యాలుగా పూర్వం నుంచి ధనియాలు, చెక్క, లవంగం ఉపయోగించబడుతున్నాయి. దాల్చిన చెక్క దాదాపు ప్రతీ వంటింటిలోను కన్పించే ఓ మసాలా దినుసు. దాల్చిన చెక్క యొక్క గాఢతతో కూడిన సువాసన మరియు దాని తీపి కలకలిసిన రుచి వంటలకు మరింత మాధుర్యతను కూడా తెస్తుంది.

దాల్చిన చెక్కఅయితే దాల్చిన చెక్క కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు. దాల్చిన చెక్క యొక్క వైద్య ప్రయోజనాల కారణంగా దాన్ని ఇటు భారతీయ సంప్రదాయ వైద్యంలోను, అటు పాశ్చాత్య వైద్యంలోనూ ఉపయోగిస్తున్నారు. దాల్చిన చెక్క వలన కడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దాల్చిన చెక్కదాల్చిన చెక్క వేడిచేసే స్వభావం కలిగి ఉంటుంది. వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల కడుపుతో వాతం తగ్గుతుంది. అజీర్తిని తగ్గించే గుణం దాల్చిన చెక్కకు ఉంది. అజార్తిని పోగొట్టడం, జీర్ణశక్తిని పెంచడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుంది. కేవలం దాల్చిన చెక్కను ఆహారంలో వేసుకోవడమేగాక బాగా మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో కలుపుకుని త్రాగడం వల్ల కూడా ఫలితాన్ని పొందవచ్చు.

దాల్చిన చెక్కబహిష్టు సమయాన స్త్రీలకు వచ్చే కడుపునొప్పివంటి ఋతు సమస్యలు, వికారం మరియు వాంతులు తగ్గించడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క యొక్క కాప్సూళ్లను (420 mg) రోజుకు మూడుసార్లు వారిచేత సేవింపజేస్తే మహిళల్లో వచ్చే తిమ్మిరి, రక్తస్రావం, వికారం మరియు వాంతుల్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రుతువు సక్రమంగా అయ్యేలాగా చూస్తుంది కూడా. రుతు రక్తము అధికమైనా దీనిని వాడవచ్చు. దాల్చిన చెక్క స్త్రీల రుతు సమస్యలనే కాకుండా గర్భాశయ దోషాల్ని కూడా అరికడుతుంది. గర్భిణీ స్త్రీ దాన్ని వాడితే సుఖ ప్రసవం అవుతుంది.

దాల్చిన చెక్కదాల్చినచెక్క పొడి మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క రోజువారీ ఆహారంలో కలిపినప్పుడు అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణ రసాలలోని అసమతుల్యత కారణంగా అధిక కొలెస్ట్రాల్ వస్తుంది. దాల్చినచెక్క శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దాల్చినచెక్క నేరుగా హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయం చేయకపోయినా, శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ వ్యాధితో సంబంధం ఉన్న సాధారణ గుండె సమస్యల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది.

దాల్చిన చెక్కదాల్చినచెక్కలో ఉన్న కౌమారిన్ సహజాంగా రక్తాన్ని పలుచబరిచే గుణాన్ని కల్గి ఉంది. అది రక్తం గడ్డ కట్టడాన్ని నిలిపివేస్తుంది. దాల్చినచెక్క సేవనం మన శరీరంలో రక్త ప్రసరణను పెంచేందుకు దారితీస్తుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దాల్చినచెక్క పొడి 1-2 చిటికెడు తీసుకోని దీనికి 1 టీస్పూన్ తేనె కలపండి. రోజుకు రెండుసార్లు భోజనం చేసిన తర్వాత తీసుకోండి. మార్పు మీకే తెలుస్తుంది.

దాల్చిన చెక్కవాత వ్యాధులలో కలిగే నొప్పిని ఇది వెంటనే నివారిస్తుంది. కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే ఎలర్జీ తీవ్రతను తగ్గించి, వాటికి విరుగుడుగా దాల్చిన చెక్క పని చేస్తుంది. దానికోసం దాల్చిన చెక్కను పొడిగా చేసిగాని, దాల్చిన చెక్క రసాన్ని గాని తీసుకోవాలి. శరీరానికి నీరు పట్టినప్పుడు దాల్చిన చెక్కను ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.

దాల్చిన చెక్కగ్యాస్ ట్రబుల్‌ ఉన్న వ్యక్తులకు దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. కడుపులోనూ, గుండెలలోనూ మంట ఉన్నా, ఎక్కిళ్లు వస్తున్నా దీనిని వాడితే మంచిది. జిగట విరేచనాలు, అమీబియాసిస్‌ వంటి వ్యాధుల్లో దాల్చిన చెక్కను బాగా మెత్తగా దంచి దానిలో కాసిని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ అయ్యేట్లు ఉడకబెట్టి గట్టిపడ్డాక దానిలో కాస్త నెయ్యి, పటిక బెల్లం వేసి కలిపి కుంకుడుకాయంత మాత్రలు చేసుకుని మూడు పూటలా తింటూ ఉండే వ్యాధి తగ్గుతుంది.

దాల్చిన చెక్కఅంతే కాదు నీళ్ళ విరేచనాలు, అజీర్తి విరేచనాలు కూడా తగ్గుతాయి. విరేచనాలతో పాటుగా వాంతులు ఉన్నప్పటికీ దాల్చిన చెక్క తగ్గిస్తుంది. పావుసేరు గుమ్మపాలలో రెండు చెంచాల దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ త్రాగితే వీర్యవృద్థి కలుగుతుంది. కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కను వాడితే కళ్ళు కాంతి వంతమవుతుంది.

దాల్చిన చెక్క చెడు శ్వాసకు అత్యంత సాధారణ కారణం నోటి కుహరంలో అధిక సూక్ష్మజీవులు చోటు చేసుకుని ఉండడమే. దాల్చినచెక్కలో ఉన్న సిన్నమిక్ ఆమ్లం మన నోటిలో ఉన్న బాక్టీరియాను చంపటానికి ప్రభావవంతంగా ఉంటుందని డెంటిస్ట్ లు సూచిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR