ఇంగువ తింటే మన శరీరంలో కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

వంటకాల్లో విరివిగా ఉపయోగించే ఇంగువ తింటే చాలా లాభాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే ఘాటైన వాసన కలిగిన ఇంగువను తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇంగువను తినడానికి చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటారు. యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు కలిగిన ఇంగువ తింటే మన శరీరంలో మనకు తెలియకుండానే ఎన్నో ఉపయోగాలు కలుగుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఇంగువఇంగువను పులిహోర, రసం, సాంబారు పచ్చళ్లలో వాడుతుంటారు. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.

సెనగ గింజ సైజులో బెల్లం మధ్యలో పెట్టి తింటే నెలసరిలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది.

నీళ్లను బాగా మరిగించి, చిటికెడు ఇంగువ వేసి రోజులో 2, 3 సార్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది. అయితే దీన్ని మరీ ఎక్కువ తీసుకుంటే విరేచనాలు అవుతాయి.

ఇంగువబెల్లంతో ఇంగువను తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుందట. అందుకే బాలింతలకు ఇచ్చే ఆహారాల్లో ఇంగువను చేరుస్తారు పెద్దవాళ్ళు.

అధిక రక్తపోటు ఉన్నవారికి ఇంగువ బాగా సహాయపడుతుంది.

ఇంగువఓ టేబుల్ స్పూన్ తేనె లో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి తీసుకుంటే గొంతులో మంట తగ్గడమే కాదు దగ్గూ, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు శ్వాసకోశ సంబంధి సమస్యలు కూడా తగ్గుతాయి.

క్యాబేజీ, బంగాళాదుంప లాంటి కూరలు తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరి ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నుంచి బయటపడాలంటే ఇవి వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు.

ఇంగువఇక రక్తపోటును అదుపులో ఉంచే గుణం ఇంగువకు ఉంది.

రోజూ దీన్ని తీసుకుంటే వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు.

ఆస్తమాతో ఇబ్బంది పడేవారు ఇంగువ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఇంగువహిస్టీరియా వ్యాధిగ్రస్తులకు ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం ఉంటుంది.

లైంగిక పటుత్వం తగ్గినవారు మర్రిపాలలో తేనె, కొద్దిగా ఇంగువ కలిపి 40 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR