జామ పండ్లు అందరికి అందుబాటులో ఉండేవి. జామపండును అమృత ఫలం అని కూడా అంటారు. జామ కాయలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనం ఇంట్లో పెంచుకునే దివ్య ఔషదం. ముఖ్యంగా జామపండు తినడం వలన అరుగుదల గుణాలు పెరిగి ఎలాంటి మలబద్ధకం అయినా వెంటనే తగ్గుతుంది.
అయితే జామకాయలు మాత్రమే కాదు జామ ఆకులో కూడా మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల భారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జామ ఆకుల వల్ల అద్భుతమైన లాభాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు
జామ పండు అంటే చాలామందికి ఇష్టం కానీ జామాకుల కషాయాల గురించి మాత్రం ఎవరికీ తెలియదు. జామ ఆకుల కషాయం వల్ల ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రోజు తీసుకునే కాఫీ టీలకు బదులుగా ఈ జామ ఆకు కషాయాన్ని అలవాటు చేసుకుంటే ఎంతో మేలు చేకూరుస్తుంది.
జామాకు కషాయం తయారుచేయు విధానం
ఐదు లేదా ఆరు జామ ఆకులను మంచినీళ్లతో కడిగి రాగి లేదా స్టీల్ పాత్రలో వేసి ఒక గ్లాసు మంచినీళ్ళు పోయాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు లేదా అయిదు నిమిషాలు మరగబెట్టాలి. తరువాత వడపోసుకొని గోరువెచ్చగా కానీ, చల్లగా కానీ తీసుకోవాలి. ఈ జామ ఆకుల కషాయాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలోని గ్లూకోజ్ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. కనుక చక్కెర వ్యాధిని నయం చేయడానికి జామ ఆకుల కషాయం బాగా ఉపయోగ పడుతుంది.
ఈ జామ ఆకుల్లో అధిక మొత్తంలో ఆక్సి లైట్లు , టానిక్స్ ఉంటాయి దీనివల్ల నోటి పూత నోటిలో పుండ్లు చిగుళ్ల వాపు గొంతు నొప్పి వంటి నోటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలి తిన్న లేక ఈ లేత జామ ఆకులతో కషాయం తయారుచేసుకొని పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకుని నా మంచి ఫలితాలు కనపడతాయి.
ఈ జామాకులను కషాయం రూపంలో గాని లేదా నేరుగా ఈ జామాకులను ప్రతిరోజు తినటం ద్వారా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి శరీరం లోని అన్ని భాగాలకు రక్తం సమృద్ధిగా అందేలా సహాయపడుతుంది. దీనివలన మనకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ జామాకు వల్ల జీర్ణాశయ సమస్యలు రాకుండా ఉండడంతోపాటు మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. దీనికి చేయవలసినది జామ ఆకులను మెత్తగా నూరి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి అరచెంచా జీలకర్ర కలిపి ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో మిక్స్ చేసి త్రాగాలి లేదా జామ ఆకుల కషాయంలో కొద్దిగా ఉప్పు కలిపి దాంట్లో కొద్దిగా జీలకర్ర కలిపి బాగా మరిగిన తర్వాత ఉదయాన్నే పరగడుపున ప్రతిరోజు తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు తగ్గుముఖం పట్టి బరువు తగ్గుటకు సహాయపడుతుంది.
ఈ జామ ఆకులు మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. మొటిమల సమస్యతో బాధపడేవారు ఈ జామ ఆకులను మెత్తగా పేస్టులాగా చేసి కొద్ది రోజులు మొహానికి రాసుకోవడం ద్వారా మొటిమల సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
జామాకుల ముద్దకు కొద్దిగా పసుపు కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనముగా రాయవలెను. ఇలా కొన్ని రోజులు చేస్తే గజ్జి తామర నుండి ఉపశమనం పొందవచ్చును.
అంతేగాక జామాకు పువ్వులను మెత్తగా నూరి కళ్ళ పైన ఉంచితే కళ్ళ సమస్యలు కండ్లకలక, కళ్లనుండి నీరు కారడం,కళ్ళు ఎర్రబడటం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇంకా మోకాళ్ళ సమస్యలతో బాధపడేవారు కాళ్ళు వాపులు ఉన్నచోట ఈ జామాకులను వేడి చేసి నొప్పులున్నచోట ఆకులను కడితే కాళ్ల నొప్పులు సమస్యలు నయం అవుతాయి.