మామిడి తొక్కల వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసా ?

మామిడి పండ్లను చూడగానే అందరికీ నోరూరుతుంది. తమ రంగుతో, రుచితో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి. అయితే మామిడి పండ్లు తినేసి ఆ తొక్కలని పారేస్తూ ఉంటాము. కానీ ఈ మామిడి తొక్కల వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతున్నాయి. మామిడి తొక్కలో ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌, కెరోటినాయిడ్లు, ఎంజైము, విటమిన్‌ ‘‘ఇ’’ మరియు విటమిన్‌ ‘‘సి’’ వంటి విలువైన సమ్మేళనాలు అధికంగా ఉన్నాయి.
benefits of mango skins
మామిడి తొక్క యాంటీఆక్సీడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. మామిడి తొక్కలో ఫైబర్‌, సెల్యులోజ్, హెమిస్యొలోజ్‌, లిపిడ్లు, ప్రొటీన్లు మరియు పెక్టిన్‌ అధికంగా ఉన్నాయి. పొటాషియం, రాగి, జింక్‌, మాంగనీస్‌, ఇనుము మరియు సెలీనియం మొదలైనవి మామిడి తొక్కలో లభించే కొన్ని ముఖ్య ఖనిజాలు. ఈ విలువైన సమ్మేళనాలు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
benefits of mango skins
అలాగే మామిడి తొక్క పిండిని నూడుల్స్‌, బ్రెడ్‌, స్పాంజి కేకు, బిస్కెట్లు, మాకరోనీ మరియు ఇతర బేకరీ ఉత్పత్తులు వంటి అనేక ఆహార పదార్ధాల ఉత్పత్తులలో ప్రముఖంగా ఉపయోగిస్తారు. ఇక అందాన్ని రెట్టింపు చేసుకోవడంలోనూ ఇవి బాగా ఉపయోగపడతాయి.  మామిడి తొక్కలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు మృత కణాల్ని తొలగించి చర్మపు మెరుపును పెంచుతాయి.
benefits of mango skins
మహిళలు అందంగా ఉండడానికి అనేక పద్ధతులని ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు అందాన్ని మరింత పెంచుకోవడానికి మామిడి తొక్కలు బాగా ఉపయోగపడతాయి. దీని కోసం కొన్ని మామిడి తొక్కలు తీసుకుని పేస్టులాగా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటే యాక్నీ, ముడతలు తొలగిపోతాయి.
benefits of mango skins
అంతేకాదు వ్యర్థమని పడేసే మామిడి తొక్కలతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ముందుగా కొన్ని మామిడి తొక్కలని తీసుకుని కొన్ని రోజుల వరకు ఎండలో ఎండబెట్టాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దానిలో కొద్దిగా పెరుగు కాని రోజు వాటర్ కాని కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి.
benefits of mango skins
అదేవిధంగా చర్మం రంగు కూడా మార్చుకోవచ్చు. ముఖం మీద ఉండే ట్యాన్ ని తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలా కుదరకపోతే మామిడి తొక్కల్ని ముఖం మీద వేసి దానితో మసాజ్ చేసుకున్నా సరిపోతుంది. కాసేపు మసాజ్ చేసి ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే ముఖంపై ట్యాన్ ని తొలగించుకోవచ్చు. అలానే యాక్నీ, పింపుల్స్ వంటి సమస్యలు కూడా పోతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR