ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

0
29

ధ్యానంతో చాల మనశ్శాంతిని పొందవచ్చు అని మనకు తెలుసు అయితే ధ్యానం చేయాలనీ అనుకున్నా కొంతమందికి ధ్యానం ఎలా చేయాలో తెలియదు. సుఖాసనంలో .. హాయిగా .. కూర్చుని .. చేతులు రెండూ కలిపి .. కళ్ళు రెండూ మూసుకుని .. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిచ్వాసాలను ఏకధారగా గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా వుండరాదు.

benefits of meditationఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత వుంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.

benefits of meditationధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం :

ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.

మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.

జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.

benefits of meditationఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.

మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.

ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

 

Contribute @ wirally

SHARE