Home Health కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

0

కరక్కాయత్రిఫలాలలో ఒకటి. క‌ర‌క్కాయ‌ను సంస్కృతంలో హరిత‌కి అంటారు. కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. ఆయుర్వేద మందుల లో ఎక్కువగా ఉపయోగించే కరక్కాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కరక్కాయ తీసుకోవడం వల్ల బుద్ధుని వికసింపజేస్తుంది. మల బద్ధకం, వాంతులు, ఫైల్స్, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తుంది. ఇలా ఎన్నో సమస్యలు కరక్కాయ సులువుగా తొలగిస్తుంది. అయితే కరక్కాయ వల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కరక్కాయకరక్కాయ వాతగుణాలను తగ్గించి, బుద్ధిని వికసింపజేస్తుంది. అంతేకాదు శక్తినిచ్చి, ఆయుష్షును పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు దీనిలో ఉంటాయి. మలబద్దకాన్ని నివారించడానికి సరైన ఔషధం. అలాగే పైల్స్‌పై కూడా ప్రభావం చూపుతుంది. యాంటి స్పాస్మడిక్, యాంటీ పైరేతిక్‌గానూ పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరం, ఎక్కిళ్లు, వాంతులను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆందోళన, నాడీమండల నిస్త్రాణాన్ని నియంత్రిస్తుంది.

కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకోవడం వల్ల విష జ్వరాలు తగ్గిపోతాయి. అదే కరక్కాయ పొడిని ఆముదం లో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దగ్గు తో పాటు కలిగే ఆయాసం నుండి బయట పడాలంటే కరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్ళు కలిపి చూర్ణం చేసుకుని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఎక్కిళ్లు, ఉబ్బసం, దగ్గు, గుండె జబ్బులు కలిసి వచ్చినప్పుడు కొంచెం వేడి చేసిన పాత నెయ్యి లో కరక్కాయ పెచ్చులు చూర్ణం, ఇంగువ పొడి బిడలవణం చేర్చి అర టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకోవాలి. దీనితో ఈ సమస్యలు మాయమైపోతాయి. చిన్న పిల్లలకి 1 నుంచి ఐదేళ్ల వరకు క్రమం తప్పకుండా దీన్ని ఇస్తే రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్యం లోనూ ఆరోగ్యంగా ఉంటారట.

కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున రెండు పూటలా ఆముదంతో కలిపి ప్రతి నిత్యం తీసుకుంటే కీళ్లనొప్పిలో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణం రెండు భాగాలకు వేయించిన పిప్పళ్ల చూర్ణం ఒక భాగం కలిపి, మోతాదుకు పావు చెంచాడు చూర్ణం, తేనెతో కలిపి ప్రతి 4 గంటలకూ ఒకసారి చొప్పున నాకిస్తూ ఉంటే కోరింత దగ్గు తగ్గిపోతుంది.

కరక్కాయ, శొంఠి కలిపి చూర్ణం చేసి బెల్లం కలిపి నిల్వచేసుకొని రోజుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగితే మలబద్ధకం తగ్గుతుంది. కరక్కాయ, శొంఠి మిశ్రమానికి బెల్లం కలిపి, రోజుకు రెండుసార్లు అర చెంచాడు చొప్పున మజ్జిగతోపాటు తీసుకుంటే శరీరంలో చేరిన అదనపు నీరు బయటకుపోతుంది.

కరక్కాయ పౌడర్‌ను నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి నూనెతో పాటు కరక్కాయ పౌడర్‌ను పేస్ట్ రూపంలో పూయడం వల్ల దాని రక్తస్రావం తగ్గించే గుణం కారణంగా గాయాలను నయం చేస్తుంది. ఇది అంటువ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది. చర్మ వ్యాధులను నివారిస్తుంది.

కరక్కాయ చూర్ణాన్ని, వేపమాను బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి రెండుపూటలా తీసుకుంటే ఆకలి పెరగటంతోపాటు చర్మంమీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, తామర లాంటి చర్మ రోగాల నుంచీ ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానపెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి కళ్లు మంటలు తగ్గుతాయి.

కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్లు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పిపన్ను పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపల రసంతో సహా లోహ ఖల్వంలో నూరి గోరుచుట్ట మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోరుచుట్ట పగిలి ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సమాన భాగం బెల్లంతోగాని, అర టీస్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. భోజనానికి గంట ముందు, 5 గ్రాముల కరక్కాయ చూర్ణంలో అంతే సమానంగా బెల్లం కలిపి, సేవిస్తే రక్తమొలలు తగ్గిపోతాయి. 5 గ్రాముల కరక్కాయ చూర్ణాన్ని 3 గ్రాముల తేనెతో, రోజూ రెండు పూటలా సేవిస్తూ చప్పిడి ఆహారాన్ని తీసుకుంటే, పచ్చకామెర్లు త్వరగా తగ్గేందుకు దోహదపడుతుంది.

పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండు ద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. మజ్జిగలో ఒక చెంచా కరక్కాయ పొడి కలిపి, రోజూ భోజనానికి ముందు సేవిస్తే స్థూలకాయం తగ్గుతుంది. కరక్కాయ ఒక అద్భుతమైన హెర్బ్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, ఐరన్, మాంగనీస్, సెలీనియం మరియు రాగి ఉండటం వల్ల తలపైన సరైన పోషణ లభిస్తుంది.

Exit mobile version