Home Health తినేసోడా వలన చర్మానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

తినేసోడా వలన చర్మానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

0

అందం కోసం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటాం. రకరకాల క్రీములు, లోషన్లూ వాడుతున్నాం. అయితే అవన్నీ తాత్కాలికంగా అందాన్ని ఇస్తాయే తప్ప చర్మానికి సహజత్వాన్ని మాత్రం ఇవ్వవు. పైగా వాటి వల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చి, స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది.

benefits of tinesodaఅందుకే సహజ సిద్ధమైన తినేసోడాతో బ్యూటీ టిప్స్ ట్రై చెయ్యడం మేలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. సహజంగా ఎండలోకి వెళ్లినప్పుడు మనల్ని కాపాడేందుకు చర్మం మెలనిన్ అనే నల్లటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల స్కిన్ గ్లో పోతుంది. ఇలా వచ్చిన మెలనిన్‌ను సహజ సిద్ధంగా పోగొట్టే లక్షణం తినేసోడాలో ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ టేబుల్ స్పూన్ తినేసోడా తీసుకోండి. దాన్లో నీరు, వెనిగర్ కలిపి పేస్టులా చెయ్యండి. దీన్ని స్కిన్‌పై రాసుకోండి. ఓ పావు గంట తర్వాత చూడండి. తెల్లటి తినేసోడా కాస్తా బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. దాంతో మెలనిన్ లేని చర్మం మెరుస్తుంది. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేసుకుంటే మేలు. రోజూ ఎండలో తిరిగేవారు 3 సార్లు చేసుకోవడం మేలు.

తినేసోడాలో యాంటి-ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, దురద, మంటలను తగ్గిస్తాయి. కొబ్బరి నూనెలో తినేసోడా వేసి… 4 లేదా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఆ పేస్టును రోజుకు 2 సార్లు చొప్పున రాసుకుంటే చర్మం మృదువుగా, దద్దుర్లు లేకుండా మారిపోతుంది.

నీరు లేదా రోజ్ వాటర్‌లో 2 టీ స్పూన్ల తినేసోడా కలిపి దాన్ని ముఖానికి రాసుకొని ఓ నిమిషం అలా వదిలేయండి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే చర్మంపై మచ్చలు, మలినాలూ పోతాయి.

కొంత మందికి చర్మంపై చిన్న చిన్న కన్నాలలా ఏర్పడి, అక్కడ మట్టి పేరుకుపోయి సమస్యగా మారుతుంది. అలాంటి చోట తినేసోడాను రాస్తే, అది చర్మాన్ని లూజ్ అయ్యేలా చేస్తుంది. దాంతో ఆ మట్టి బయటకి వచ్చేస్తుంది.

Exit mobile version