Home Health ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడితే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా ?

ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడితే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా ?

0

సైంధవ లవణం అనేది ‘హాలైట్’ లేదా సోడియం క్లోరైడ్ (NaCl)కు మరో పేరు. భారతదేశంలో, ఈ రాతి ఉప్పును ‘హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్’ లేదా ‘హిమాలయన్ ఉప్పు’ అని కూడా పిలువడం జరుగుతోంది. ఈ రాతి ఉప్పు హిమాలయ పర్వత ప్రాంతంలో సాధారణంగా లభిస్తుంది. రాతి ఉప్పును హిందీలో ‘సెంధానమక్’ అని పిలుస్తారు మరియు సంస్కృతంలో ‘సైంధవ లవణ’ అని పిలుస్తారు. రాతి ఉప్పును ఉప్పు గనుల నుండి తేమ లేకుండా పొడి (dry) గా గాని లేదా ద్రావణం ప్రక్రియ ద్వారా గాని సేకరించే వారు. స్వఛ్చమైన రాతి ఉప్పు (ప్యూర్ రాక్ సాల్ట్) సాధారణంగా రంగు లేకుండా ఉంటుంది లేదా తెలుపు రంగులో ఉంటుంది.

benefits of synthetic salt?రాతి ఉప్పు దాని రకం మరియు దానిలో ఇమిడిఉన్న మలినాల పరిమాణం కారణంగా లేత నీలం, ముదురు నీలం, ఊదా రంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు లేదా బూడిద రంగుల్లో కూడా లభిస్తుంది. హిమాలయన్ (రాతి) ఉప్పుయొక్క ఉత్తమ లక్షణం ఏమంటే అది ప్రకృతిసిద్ధంగా ఎలాంటి రసాయనిక పదార్థాల కల్తీ లేకుండా స్వచ్ఛంగా లభిస్తుంది. ఇతర సాధారణ తినే ఉప్పులైతే రసాయనిక పదార్థాలతో మలినమై ఉండేందుకు అవకాశాలున్నాయి. వాస్తవానికి, ఆయుర్వేద వైద్యం ప్రకారం, మనకు లభించే అన్ని లవణాలలో సైన్ధవ లవణం ఉత్తమమైంది. ఈ లవణంతో ఆరోగ్యానికి ఎటువంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం..

ఆకలిని పెంచుతుంది:

ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు మిరియాలు, అల్లం, పొడుగు మిరియాలు, ఏలకులతో కలిపి వాడితే ఆకలిని పెంచుతుంది.

జీర్ణానికి మంచిది:

రాళ్ళ ఉప్పులో ఉండే కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఆరోగ్యానికి మంచిది. లాలాజలం, జీర్ణరసాల సమన్వయంలో ఇది తోడ్పడుతుంది. దీనికున్న లక్షణంతో కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది. యాంటాసిడ్ కూడా ఉన్నది. ఆయుర్వేదంలో ఈ సైంధవ లవణాన్ని సోంఫు, కొత్తిమీర పొడి మరియు జీలకర్రతో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుందని చెబుతారు.

రక్తపోటును తగ్గిస్తుంది:

ఉప్పు, రక్తపోటుల బంధం విడదీయలేనిది. తక్కువ బిపిని చిటికెడు రాళ్ళ ఉప్పును నీటిలో వేసి రోజుకు రెండు సార్లు తీసుకోటంతో పరిష్కరించవచ్చు. కానీ అధిక బిపి ఉన్నవారు మాత్రం దీన్ని ముట్టుకోకూడదు.

బరువు తగ్గటం:

ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు కొవ్వుని కరిగిస్తుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు తీపిపై మక్కువను ఇన్సులిన్ ను తగ్గించటమే కాక, కొవ్వు కణాలను కూడా తొలగిస్తాయి.

గొంతునొప్పికి పరిష్కారం:

గోరువెచ్చని ఉప్పునీరుతో పుక్కిలించటం అనే ఈ ఇంటిచిట్కా గొంతునొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది గొంతునొప్పిని, వాపును తగ్గిస్తుంది. పై భాగం శ్వాసకోశం ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

మెటబాలిజంను పెంచుతుంది:

రక్తంలో ఉప్పుశాతం సరిగా ఉంటేనే కణాలు బాగా పనిచేయగలవు. రాళ్ళ ఉప్పు శరీరంలో నీరుని పీల్చుకుంటుంది, దానివల్ల కణాలు లవణాలు, పోషకాలను పీల్చుకోగలవు. కానీ అధిక బిపి సమస్యలు ఉన్నవారు దూరంగా కేవలం తగినంత ఉప్పుని మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.

రక్తం కారే చిగుళ్ళకు చికిత్స:

రాళ్ళ ఉప్పును ప్రాచీనకాలంలో పళ్ళను తెల్లగా చేయడానికి, నోటి దుర్వాసనకి పరిష్కారంగా వాడేవారు. త్రిఫల, వేప పౌడర్లతో కలిపి దీన్ని వాడితే చిగుళ్ల సమస్యలు నివారించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇదే రాళ్ళ ఉప్పు యొక్క అత్యుత్తమ లాభం.

 

Exit mobile version